ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తన ప్రసంగాలలో పేద వర్సెస్ పెత్తందారు అనే పదాలను విరివిగా ఉపయోగిస్తున్నారు.. వాటినే తన ట్రంప్ కార్డులుగా ప్రయోగించి అధికారం దక్కించుకోవాలని ఉబలాటపడుతున్నారు.. తాను పేదలకు సాయం చేస్తున్నానని, డీబీటీ పద్ధతిలో రెండు లక్షల కోట్ల రూపాయలను పేదలకు పంచి పెట్టానని చెబుతున్నారు. రాబోయే ఎన్నికలు పేద వర్సెస్ పెత్తందార్ల మధ్య యుద్ధం అని తనను తాను పేద ముఖ్యమంత్రిగా, తాను పేదల పక్షపాతిగా చెప్పుకోవడానికి, చిత్రీకరించుకోవడానికి ఆయన వేయని ఎత్తుగడ లేదు.. తాజాగా అదే బూమరాంగ్ అవుతోందనే చర్చ సాగుతోంది..
ముఖ్యమంత్రి జగన్.. దేశంలోనే రిచెస్ట్ సీఎం అని గణాంకాలు చెబుతున్నాయి.. ఆయన ఆస్తులు సుమారు 600 కోట్లకుపైగా ఉన్నాయని చెబుతారు… ఈ స్థాయిలో ఆస్తులు ఉన్న ధనిక ముఖ్యమంత్రి దేశంలోనే లేరు.. ఆయనే రిచెస్ట్ ముఖ్యమంత్రి అని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సెటైర్లు వేస్తుంటారు.. తనకు తాను మాత్రం పేద సీఎమ్‌గా చెప్పుకోవడానికి తెగ తాపత్రయ పడుతున్నారు జగన్..
ఇక జగన్ ఎంతో విలాసవంతమయిన జీవితం గడుపుతారనే చర్చ కూడా ఉంది.. బెంగళూరు, హైదరాబాద్, ఇడుపులపాయ, కడప, తాడేపల్లిలో ఆయన నివాసాలను ఒక్కసారి గమనిస్తే వాటి వైభోగం అర్ధం అవుతుందని చెబుతారు వైసీపీలోని కొందరు నేతలు సైతం.. ఈ ఆస్తులను ఎలా కూడబెట్టారు అనేది ఓపెన్ సీక్రెట్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి.. అయితే, ఆయన వ్యక్తిగత ఆస్తులు ఎంతో శ్రమించి, ఆయన తెలివితేటలు ప్రదర్శించి సంపాదించారు అని ఊహించుకోవచ్చు..
కానీ, ప్రభుత్వ ఆస్తులతో ఆయన భారీ విలాసవంతమయిన భవనాలను నిర్మించుకోవడం దుమారం రేపుతోంది.. విశాఖలో రిషికొండకు బోడిగుండు కొట్టి అక్కడ నిర్మిస్తోన్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో చదరపు గజానికి ఏకంగా 24వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.. దేశంలోని రిచెస్ట్ బిజినెస్ మేన్‌లు, వేల కోట్ల ఆస్తిపరులు కూడా ఈ స్థాయిలో వ్యక్తిగత స్థాయిలో కూడా ఖర్చు చేసి భవనాలు నిర్మించుకోవడానికి సంశయిస్తారేమో. కానీ, ప్రభుత్వ సొమ్ముతో జగన్…. తన క్యాంప్ ఆఫీస్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు.. ఎంతయినా పేద ముఖ్యమంత్రి కదా… అని సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఈ భవంతిలో బాత్ రూమ్ కోసం పాతిక లక్షలు, ఇటు బాత్ రూమ్ కమోడ్ కోసం మరో 20 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటే ఏ స్థాయిలో జగన్… పేదల గురించి ఆలోచించి మరీ తన వ్యక్తిగత అవసరాలను కట్ చేసుకొని మరీ, చదరపు గజానికి 24వేల రూపాయల తక్కువ ఖర్చుతో విలాసవంతమయిన భవనం నిర్మించుకుంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి, ఈ పేద ముఖ్యమంత్రి దీనికి ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి..