సాధారణంగా ఏ భాషలో అయినా.. సూపర్ హిట్టైన సినిమానే రీమేక్ గా చేయాలను కుంటారు. అది కూడా సబ్జెక్ట్ యూనిక్ గా ఉంటేనే. అయితే కొన్ని సినిమాలు కాన్సెప్ట్ బాగాన్నప్పటికీ, స్ర్కీన్ మీద అంత ప్రభావవంతంగా కన్సీవ్ కాలేక చతికిల పడుతుంటాయి. అలాంటి సినిమాల్ని మరింత బెటర్ గా మార్చుకుంటే.. రీమేక్ చేయడానికి అర్హత సాధించినట్టే. అలాంటి ఓ సినిమా నానీ ‘గ్యాంగ్ లీడర్’.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన నానీ గ్యాంగ్ లీడర్ .. కాన్సెప్ట్ బాగానే ఉంటుంది. అయితే ఎందుకనో సినిమా ఆశించిన రీతిలో మ్యాజిక్ చేయలేకపోయింది. ఒక స్ట్రగుల్డ్ రైటర్.. కొందరు మహిళల రివెంజ్ తీర్చడానికి సహాపడతాడు. ఈ కథాంశంతో ఔట్ అండ్ ఔట్ కామెడీతో.. కాసిన్ని ఎమోషన్స్ తో సినిమాను తెరకెక్కించాడు విక్రమ్ కుమార్. నానీ తన పాత్రను అద్భుతంగా పోషించాడు. అయినా ఎక్కడో తేడా కొట్టింది.
అయినప్పటికీ .. ఈ సినిమాను తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సైతం రీమేక్ కానుండడం విశేషమని చెప్పాలి. ఈ విషయాన్ని విక్రమ్ కుమారే స్వయంగా చెప్పాడు. ఒక దర్శకుడికి ఇంతకన్నా తృప్తి ఇంకేముంటుందని చెప్పాడు. అయితే ఈ మూడు భాషల్లోనూ దర్శకుడు ఎవరు, హీరోలు ఎవరనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఒక ఫ్లాప్ సినిమాను మూడు భాషల్లో రీమేక్ అవుతోందంటే.. ఆ కథాంశం సమ్ థింగ్ స్పెషల్ అన్నట్టే కదా..