ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి మరో లేఖ సంధించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన రాసిన లేఖలో విజ్ఙప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం తీసుకువస్తామని ప్రకటించామని, ఉద్యోగులు ఆ మాట నమ్మి ఓట్లేశారని రఘురామరాజు గుర్తు చేశారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోందని, ఇప్పటికైనా సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం అమలు చేస్తే ఉద్యోగులంతా సంతోషిస్తారని రఘురామరాజు లేఖలో వివరించారు.
ప్రభుత్వ వైఫల్యాలే ఆయుధాలు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలనే ఆయుధాలుగా సంధిస్తున్నారు. సామాజిక పింఛన్లు వెంటనే రూ.2750 చేయాలని, బకాయిలు కూడా కలిపి నెలకు రూ.3000 పింఛను ఇవ్వాలంటూ నిన్ననే సీఎం జగన్‌కు ఓ లేఖ రాసిన రఘురామరాజు, ఇవాళ మరో లేఖ సంధించారు. ఇలా ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేస్తూ ప్రతి రోజూ సీఎం జగన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడని జనం చర్చించుకుంటున్నారు.
Must Read ;- జగన్ మినహా సీఎంలందరికీ రఘురామరాజు లేఖలు