అందమైన కథానాయికలకు అందమైన గొంతుకూడా ఉంటే.. వారి ఆట, మాటే కాదు.. పాట కూడా అదిరిపోతుంది. అందుకే సంగీతంలో మంచి ప్రవేశం ఉన్న ముద్దుగుమ్మలు అప్పుడప్పుడు పాటలు పాడుతూ.. అభిమానుల్ని అలరిస్తుంటారు. ఈ నేపథ్యంలో మాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ .. ఇప్పుడో సినిమా కోసం పాట పాడడం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. సినిమా పేరు నిన్నిలా నిన్నిలా . ఈ అచ్చ తెలుగు సినిమాకి ఓ మలయాళ కుర్రోడు దర్శకత్వం వహించనుండడం హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు మాలీవుడ్ లో యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరైన దివంగత దర్శకుడు ఐవి శశి, సీనియర్ నటీమణి సీమ.. దంపతుల తనయుడు అనీ శశి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇందులో అశోక్ సెల్వన్ హీరో కాగా .. నిత్యామీనన్ , రీతూ వర్మ కథానాయికలు. ఇటీవల నిత్యామీనన్ పాడిన పాటను బెంగళూర్ లోని ఒక స్టూడియో లో రికార్డు చేశారట. త్వరలోనే సరోద్ విద్వాంసుడు సౌమిక్ దత్తాతో కలిసి ఇంగ్లీష్ లో ఈ పాట సింగిల్ ను తీసుకురానుందట నిత్యామీనన్. నిత్యామీనన్ తెలుగులో ఓన్ వాయిస్ ఇవ్వడం ఎప్పటినుంచో అలవాటు చేసుకుంది. ఇప్పుడు పాటలు కూడా పాడేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అమ్మడి మాతృభాష మలయాళమే అయినప్పటికీ.. తెలుగులో చక్కగామాట్లాడుతూ.. ఇతర భాషల కథానాయికలకి ఈ విషయంలో స్ఫూర్తిగా నిలిచింది. ఇక త్వరలో వారు కూడా నిత్యమీనన్ లాగానే పాటలు పాడేస్తారేమో చూడాలి.











