టాలీవుడ్ లో ఒకప్పుడు భానుమతి, విజయనిర్మల, సావిత్రి లాంటి నటీమణులు హీరోయిన్స్ గా రేజింగ్ లో ఉండగానే .. దర్శకత్వంలోనూ తమ ప్రతిభ చూపించారు. తర్వాత.. హీరోయిన్స్ లో మెగా ఫోన్ పట్టుకున్న వారి సంఖ్య టాలీవుడ్ లో అంతగా లేకపోయినా.. ఒక్క జీవిత మాత్రమే దర్శకురాలిగా మెగా ఫోన్ పట్టుకుంది. తమిళంలోనూ రేవతి, సుహాసిని లాంటి కథానాయికలూ కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. కాకపోతే.. వారంతా అప్పటికి హీరోయిన్స్ గా నటించడం లేదు. అలాగే. శ్రీప్రియ కూడా మొన్నా మధ్య ‘దృశ్యం’ తెలుగు సినిమాకి దర్శకత్వం వహించింది. ఇప్పుడు మళ్లీ భారతీయ తెరమీద కొందరు ఆడ లేడీ ఔరత్ లు మెగా ఫోన్ పట్టుకొని యాక్షన్ కట్ చెప్పడానికి సిద్ధమవుతున్నారు.
మళ్ళీ దర్శకత్వం చేయనున్న కంగనా రనౌత్
బాలీవుడ్ లో అద్భుతమైన నటనతో కంగనా రనౌత్ తన ప్రతిభను చాటుకుంది. రెండు సార్లు జీతీయ అవార్డు ను కూడా గెలుచుకుంది. గత ఏడాది మణికర్ణిక సినిమాతో తప్పని సరిపరిస్థితుల్లో కంగానా దర్శకురాలిగా మారిన సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు క్రిష్ మణికర్ణిక సినిమాను సగం డైరెక్ట్ చేసి బాలయ్యతో యన్టీఆర్ సినిమా చేయడానికి టాలీవుడ్ కి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ పరిస్థితుల్లో మణికర్ణిక బాధత్యను తన భుజాలకెత్తుకున్న కంగనా ఆ సినిమా బ్యాలన్స్ పార్ట్ కు దర్శకత్వం వహించి మంచి సక్సెస్ అందుకుంది. ఆ అనుభవంతోనే కంగానా ఇప్పుడు మరోసారి మెగా ఫోన్ పట్టనుండడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. సినిమా పేరు ‘అపరాజిత అయోధ్య’. సుప్రీమ్ కోర్ట్ రామమందిర నిర్మాణంలో తీర్పిచ్చిన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి అద్భుతమైన స్ర్కిప్ట్ రాశారట. ఈ సినిమాకి కంగానా నిర్మాతగా వ్యహరించడమే కాకుండా.. దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టనుందట.
యాక్షన్ కట్ చెప్పనున్న అక్కినేని వారి కోడలు
ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్ చక్రం తిప్పుతోన్న అక్కినేని వారి కోడలు సమంతా.. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పై ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేస్తోంది. ఇప్పుడు సమంతా చేయబోతున్న సినిమాల లిస్ట్ చూస్తే చాలానే ఉన్నాయి. అయితే అమ్మడు వీటితో పాటు . తనలోని మరో టాలెంట్ ను బైట పెట్టేందుకు సిద్ధమవుతోందట. లాక్ డౌన్ సమయంలో సమంతా కు వచ్చిన ఆలోచనలో భాగంగా ఆమె ఒక సినిమాకి దర్శకత్వం చేయబోతోందట. ఆమె దగ్గర ఒక కథ రెడీగా ఉందట. అన్నపూర్ణ సంస్థలోనే ఈ సినిమా ఉండబోతుందట. అతి త్వరలోనే సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం.
దర్శకురాలు కాబోతున్న సీనియర్ నటి కళ్యాణి
రాజశేఖర్ శేషు సినిమాతో టాలీవుడ్ లో కథానాయికగా రంగ ప్రవేశం చేసిన మలయాళ నటీమణి కళ్యాణి గుర్తుందా? దొంగోడు, కబడ్డీ కబడ్డీ, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పెదబాబు లాంటి సినిమాలతో కథానాయికగా మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత కేరక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయింది. మొన్నామధ్య వచ్చిన విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన కళ్యాణి.. త్వరలో ఒక సినిమాకి డైరెక్షన్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుందట. చేతన్ శీను,సిద్ధి, సుహాసిని మణిరత్నం, రోహిత్ మురళీ లాంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సో.. డైరెక్టర్స్ కాబోతున్న ఈ నటీమణులు ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి.











