వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ.. ‘పవర్ స్టార్’ మూవీ తర్వాత మరో కాంట్రావర్షియల్ మూవీకి తెరదీశాడు. సినిమా పేరు ‘ఆర్జీవీ మిస్సింగ్’. నిత్యం ఎవరినో ఒకరిని కెలికి.. అవతలివారిలోని సహనానికి పరీక్ష పెడుతుంటాడు వర్మ . ఆ కారణంగా వర్మ మీద కక్షతో ఆయన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో తెరకెక్కించిన సినిమా ఇది. నేడు విజయదశమి సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
సినిమా ట్రైలర్ ను చూస్తుంటే.. వర్మ అందరినీ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇందులో చిరంజీవి, పవన్ కళ్మాణ్, చంద్రబాబు నాయుడు, కె.ఏ పాల్, కె.సీ.ఆర్, రజనీకాంత్ లను పోలిన పాత్రలు కనిపిస్తున్నాయి. మిస్సయిన ఆర్జీవీని రజనీకాంత్ పోలికలతో ఉన్న గజనీకాంత్ అనే పోలీసాఫీసర్ వెతుకుతూఉంటాడు. ఆ క్రమంలో అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఆయన కిడ్నాపింగ్ కి కారణం వీరిలో ఎవరై ఉంటారు అనే అంశాన్ని ప్రేక్షకులకే ఒదిలిపెట్టి.. ఈ ట్రైలర్ ను కట్ చేశాడు వర్మ. కె.వి. ప్రొడక్షన్స్ బ్యానర్ పై అదిర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్జీవీ మిసింగ్’ మూవీ విడుదలయ్యాకా ఏ రేంజ్ లో వివాదాలను లేవనెత్తుతుందో చూడాలి.