Rare Combination – Dilip Kumar With NTR and MGR :
సమకాలీనులైన ముగ్గురు నట దిగ్గజాలు కలుసుకోవడం అనేది అరుదైన విషయం. వారే దిలీప్ కుమార్, మన మహానటుడు నందమూరి తారక రామారావు, తమిళ సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్. వీరు ముగ్గురూ పుట్టింది ఇంచుమించు కొద్ది పాటి తేడాతోనే. వీరి సినిమా కెరీర్ ప్రారంభమైంది కూడా అంతే. అప్పట్లో అటు బాలీవుడ్ కూ, ఇటు టాలీవుడ్ కూ కేంద్ర బిందువుగా మద్రాస్ ఉండేది. అక్కడి స్టూడియోల్లో జరిగే షూటింగ్ కు బాలీవుడ్ నటులంతా మద్రాసు వచ్చేవారు.
అలా దిలీప్ కుమార్ కూడా అనేక సందర్భాల్లో మద్రాసుకు వచ్చి షూటింగుల్లో పాల్గొనే వారు. ఎన్టీఆర్ కు ఎలాంటి పేరు ప్రతిష్టలు వచ్చాయో అలాంటి పేరు ప్రతిష్ఠలు తమిళనాడులో ఎంజీ ఆర్ కు కూడా వచ్చాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ గా దిలీప్ కుమార్ ఎదిగారు. ఆయన నటించిన కొన్ని సినిమాలు ప్రాంతీయ భాషల్లోనూ రీమేక్ అయ్యాయి. ఈ ముగ్గురిలో ఇద్దరు ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రులైతే దిలీప్ కుమార్ మాత్రం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఎన్టీఆర్ నటించిన రాముడు – భీముడు చిత్రం ఆధారంగా దిలీప్ కుమార్ నటించిన రామ్ ఔర్ శ్యామ్ చిత్రాన్ని బాలీవుడ్ లో నిర్మించారు. ఇలాంటి ముగ్గురు అగ్ర హీరోలు కలిసి కనిపించే సందర్భాలు అరుదు. అలాంటి ఓ సందర్భం వచ్చింది. పైన మీకు కనిపించే ఆ ఫొటో ఆ సందర్భంలో తీసిందే. కాకపోతే ఎన్టీఆర్, ఎంజీఆర్ ల కన్నా దిలీప్ కుమార్ ఎక్కువ కాలం జీవించి ఉన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డు లెన్నింటినో ఈ ముగ్గురూ అందుకున్నారు. దిలీప్ కుమార్ అస్తమయంతో మూడో నట దిగ్గజాన్ని కూడా అభిమానులు కోల్పోయారు.











