క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో అందరికీ తెలిపారు. ఇటీవల రాయపూర్‌లో జరిగిన రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ తరఫున సచిన్ టెండూల్కర్ మ్యాచ్‌లు ఆడి శ్రీలంకపై విజయం సాధించారు. దీని తర్వాత ముంబయిలో ఉంటున్న సచిన్ కొద్దిపాటి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు.
ముంబయి ఇండియన్స్ టీమ్‌కి ఆడబోతున్న సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం 7 రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. కరోనా పరీక్షల అనంతరం ఆయన టీమ్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- బాలీవుడ్ సూపర్ స్టార్ కు కరోనా పాజిటివ్
— Sachin Tendulkar (@sachin_rt) March 27, 2021