సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా ప్రస్తుత సీఐఎస్ఎఫ్ చీఫ్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ నియమితులయ్యారు.సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ లేవనెత్తిన ఆరు నెలల నిబంధనతో ఆయనకు ఈ పదవి దక్కింది.మహారాష్ట్ర కేడర్‌కు చెందిన సుబోధ్ కుమార్ జైశ్వాల్‌ను ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభలో విపక్షనేత అధీర్‌రంజన్ చౌధురిల త్రిసభ్య కమిటీ ఎంపిక చేసింది.బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు.ఎస్పీజీ,ముంబయి యాంటీ టెర్రరిజం స్క్వాడ్,మహారాష్ట్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం,స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్సుల్లో ఆయన సేవలందించారు.దేశంలో సంచలనం సృష్టించిన అబ్దుల్ కరీమ్ తెల్గీ స్టాంపుల కుంభకోణం కేసును జైశ్వాల్ దర్యాప్తు చేశారు.
Must Read ;- సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైశ్వాల్











