దేశమంతటా ప్రధాని మోడీకి వ్యతిరేక భావనలు వీస్తున్నాయి. ఒకవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే, మరోవైపు మోడీ ప్రసంగాలకే పరిమితమవుతుండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రధాని నరేంద్రమోదీ విఫలమయ్యారని ఢిల్లీలోని కొందరు యువకులు మోదీని విమర్శిస్తూ పోస్టర్లను అతికించారు. దేశ ప్రజలను వదిలేసి మోదీ విదేశాలకు వ్యాక్సిన్‌లు అమ్ముకున్నారని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి యువకులను అరెస్ట్ చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్స్ నిర్వహించి 800 బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 25 మంది యువకులు ఇందుకు కారణమయ్యారంటూ అరెస్ట్ చేశారు.
రాహుల్ గాంధీ ఫైర్
పోస్టర్ల ఘటనను ప్రతిపక్షాలు సమర్థించాయి. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డాయి. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ పోలీసులకు సవాల్ విసిరారు. మోడీని విమర్శిస్తూ ఓ పోస్టర్ ను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. నన్ను కూడా అరెస్ట్ చేస్తారా.. అంటూ సవాల్ విసిరారు. కోవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ సక్రమంగా జరగడ లేదంటూ మోదీపై ఫైర్ అయ్యారు.
Arrest me too.
मुझे भी गिरफ़्तार करो। pic.twitter.com/eZWp2NYysZ
— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2021











