న్యాయస్థానాల్లో కార్యకలాపాలు, విచారణలపై ప్రత్యక్ష ప్రసారం అంశంపై చాలా కాలం నుంచి చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం చేసే అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కోర్టు వ్యవహారాల్లో దాపరికం లేకుండా ప్రత్యక్ష ప్రసారం విధానాన్ని అమలు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. అయితే జస్టీస్ ఎన్వీ రమణ సీజేఐగా బాధ్యతలు చేపట్టాక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వినియోగంలోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జర్నలిస్ట్‌ల కోసం సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ యాప్‌ను గురువారం ప్రారంభించారు.
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!
తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...











