ఏపీలో మహిళలకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా 90 రోజుల పాటు లక్షా 2 వేల 832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ శిక్షణ కేంద్రాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ఇక ఇప్పటికే తల్లికి వందనం విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి రూ. 9 వేల 407 కోట్లు కేటాయించింది కూటమి సర్కార్. ఈ స్కీం ద్వారా ప్రతీ కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉన్నా..అంతమందికి సంవత్సరానికి రూ. 15 వేల చొప్పున ఇస్తామని చెప్పింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులందరికీ నగదు ఇస్తాం అని స్పష్టం చేసింది. మే నెలలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతుంది కూటమి సర్కార్.ఇప్పటికే మహిళలకు సంబంధించి ఫ్రీ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సైతం ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. మొత్తంగా మహిళలకు కూటమి సర్కార్ పెద్దపీట వేస్తోంది.
ఇలాంటి స్వయం ఉపాధి హామీ పథకాలకి జగన్ సర్కార్ నీళ్లు వదిలాడు.. డీబీటీ పేరుతో ప్రజల అకౌంట్లలోకి లక్షల కోట్లు బటన్ నొక్కుతున్నానని చెప్పి, అవినీతి సామ్రాజ్యం ఏలాడు. అయిదేళ్లు అరాచకాలకు పాల్పడ్డాడు.. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను చైతన్య వంతులని చేయడంతోపాటు వారికి ఆర్ధిక స్వావలంబన, ఉపాధి కల్పించడానికి కుట్టుమిషన్ల పంపిణీతోపాటు వారికి ఆ వర్క్ కూడా నేర్పుతున్నారు.. మహిలలను వారి కాళ్లపై నిలబడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏకంగా లక్షా పదివేల మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు..
చంద్రబాబు సర్కార్ చేపడుతున్న ఈ ఉపాధి హామీ పథకంపై వైసీపీ శ్రేణులు నివ్వెరపోతున్నాయి.. ఇవి తమపై వ్యతిరేకతను మరింత పెంచుతాయని, జగన్ అన్న ఇలాంటి వాటిని ఎందుకు అందించలేకపోయారని నిలదీస్తారని భయపడుతున్నారు.. లక్షమందికి కుట్టుమిషన్ల పంపిణీ అంటే లక్ష కుటుంబాలకు చేరువ కావడం అని అర్ధం.. ఇదే వైసీపీని టెన్షన్ పెడుతోంది.. మహిళల ఓట్ బ్యాంక్ కోసం జగన్ వారి అకౌంట్లలో డబ్బులు వేసి, వారిని మభ్య పెట్టే ప్రయత్నం చేయగా, చంద్రబాబు వారికి అకౌంట్లలో నిధులతోపాటు ఇటు ఉపాధిని సైతం అందిస్తున్నారు.. ఈ పథకంతో లక్ష మంది మహిళలు స్వావలంబన, సాధికారిత దిశగా అడుగులు వేయడం ఖాయం అని తేల్చి చెబుతున్నారు ఆర్ధిక వేత్తలు..











