పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ‘వకీల్ సాబ్’ గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా సంక్రాంతి రోజు సాయంత్రం విడుదలైంది. అభిమానులకు ఈ టీజర్ పండగ చేసేస్తోంది. ఇందులో మొదట అనుకున్న దానికన్నా హీరోయిన్ పాత్ర నిడివి కాస్త తగ్గించినట్టు సమాచారం. పవన్, శ్రుతిహాసన్ ల మీద తీయాల్సిన ఓ పాటను కూడా తీసేశారని తెలుస్తోంది.
క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే పవన్ ఓ సినిమా చేస్తున్నారు. కారణం ఏదైనా గానీ సినిమా షూటింగును త్వరగా ముగించాలని పవన్ నిర్మాత దిల్ రాజును కోరినట్టు తెలుస్తోంది. అందుకే షూటింగును ముగించేశారు. పాట లేకపోయినా శ్రుతి హాసన్ కు మాత్రం లక్ అనే అనుకోవాలి. కోవిడ్ తర్వాత విడుదలైన సినిమాల్లో శ్రుతి హాసన్ నటించిన సినిమా ‘క్రాక్’ మాత్రమే సూపర్ హిట్ అయ్యింది.
ఇలా శుభారంభం జరగడం శ్రుతికి మంచి సెంటిమెంట్ అనుకోవాలి. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే ‘వకీల్ సాబ్’ కూడా ఆమెకు హిట్ గా మారే అవకాశం ఉంది. ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ లాయర్ గా నటించిన ఈ సినిమాలో అనన్య, అంజలి, నివేదా థామస్ తదితరులు నటించారు. తమన్ దీనికి సంగీతం సమకూర్చారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.
టీజర్ ఎలా ఉంది?
వకీల్ గా పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది ఈ టీజర్. పవన్ కళ్యాణ్ కోటు వేసుకోవాడం, తన కార్యాలయంలో లా పుస్తకాల మీద ఉన్న ముసుగు తొలగించడం ఈ టీజర్ లోని ప్రత్యేకత. ఆయన కొంత కాలంగా ప్రాక్టీసుకు దూరంగా ఉన్నారని ఈ దృశ్యం చూస్తేనే అర్థమవుతోంది. దుమ్ము పేరుకుపోయి ఉన్న పుస్తకాలవి. మళ్లీ ఏదో కీలకమైన కేసు వాదించాల్సి వచ్చేసరికి కోటు వేసుకోవలసి వచ్చింది.
కోర్టులో ‘అబ్జక్షన్ యువరానర్’ అంటూ లేచే సన్నివేశాన్ని చూపించారు. అలగే మెట్రో రైలులో ఫైట్ కూడా ఆకర్షణీయంగా మలిచారు. ‘కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అనే డైలాగు చెబుతూ రౌడీలను చావగొట్టే సన్నివేశమది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ టీజర్ మంచి ఫీస్ట్ గానే చెప్పాలి.