రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి సోషల్ మీడియాలో అతడి యాక్టివిటీ అన్ లిమిటెడ్. ఎప్పుడు ఎక్కడ ఏది అనిపించినా.. వెంటనే ఇన్ స్టా గ్రామ్ లో వాలిపోవడం.. అతడికి పోస్ట్ తో పెట్టిన విద్య. రీసెంట్ గా అతడి మనసు యూరప్ వైపుకు లాగుతున్నట్టుంది. అనుకోవడమే తరువాయి… ఠక్కున తన మనసులో మాటను తన ఫాలోవర్స్ తో షేర్ చేసేసుకున్నాడు విజయ్. యూరప్ లాంటి కంట్రీస్ లో స్వేచ్ఛగా తనకి నచ్చిన ప్లేసెస్ లో మనసారా విహరించొచ్చు.. తనకి నచ్చిన ఫుడ్ కడుపారా ఆరగించి… ఆ రుచిని ఆస్వాదించొచ్చు. అందుకేనేమో అతగాడు ఇప్పుడు అదే మూడ్ తో ఇన్ స్టా లో ఫుడ్ తింటున్న పోజుతో ఒక పోస్ట్ పెట్టాడు.
యూరప్.. పనిచేసి చేసి పిచ్చెక్కినప్పుడు, నటుడ్ని కావడం వల్ల కలిగే కొన్ని అసౌకర్యాలనుంచి తప్పించుకోవడానికి, మరి ముఖ్యంగా అక్కడ దొరికే ఫుడ్ కోసం ఇప్పటికిప్పుడు అక్కడ వాలిపోవాలనిపిస్తోందని విజయ్ ఒక పిక్ ను షేర్ చేసి మరీ తన కోరిక ను వ్యక్తపరిచాడు. ఆ పిక్ లో విజయ్ హెయిర్ స్టైల్ లుక్ అండ్ స్మైల్ ఆకట్టుకుంటోంది. కరోనా వల్ల ఇంట్లో ఉండిపోయాడు కానీ… లేకపోతే.. ఇప్పుడు యూరప్ లో ఒక రెస్టారెంట్ నుంచే ఈ పిక్ షేర్ చేసి ఉండేవాడేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా.. మన అర్జున్ రెడ్డి ఏం చేసినా చాలా శ్రద్ధగా చేస్తాడని దీన్ని బట్టి అర్ధమవుతోంది కదూ… ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.











