కరోనాతో ఇంటి వద్ద ఐసోలేషన్‌లో ఉన్నవారు ఆక్సిజన్‌కు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. మంచంపై బోర్లా పడుకుని వీలైనంత వరకు గాలి పీల్చుకుని వదులుతూ ఉంటే ఆక్సిజ్ లోపం చాలా వరకు తగ్గుతుంది. అలా రోజు 20 నిమిషాలు పాటు చేయాలి. ముక్కును ఒక పక్క మూసి గట్టిగా గాలి తీసుకుని వదలాలి. అలాగే రెండో పక్క ముక్కు మూసి గాలి తీసుకుని వదలాలి. అలా 10 సార్లు చేస్తే మంచింది.

ప్రోనింగ్ పొజిషన్ సో బెటర్
హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు ఆక్సిజన్ లెవల్స్‌పై జాగ్రత్తపడాలి. అలాంటి వాళ్ల కోసం ఆక్సిజన్ మెషిన్లు వచ్చేశాయి. కానీ, అవి చాలా కాస్ట్లీ. అందుకే, నేచురల్‌గా మన ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవాలి. అందుకు ‘ ప్రోన్ పొజిషన్’ ప్రాక్టీస్ చేస్తే బెటర్ అని ఈ మధ్య వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఏలా చేయాలంటే..
మంచంపై ముందు బోర్లా పడుకోవాలి. తర్వాత మెడ కింది భాగంలో ఒక దిండును పెట్టుకోవాలి. ఛాతి నుంచి కింద వరకు రెండు దిండ్లను ఉంచుకోవాలి. మరో రెండు దిండ్లను మోకాలి కింద పెట్టుకోవాలి. ఈ ఒక్క భంగిమలోనే కాకుండా వివిధ యాంగిల్స్‌లో కూడా విశ్రాంతి తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్కో పొజిషన్‌లో 30 నిమిషాల కంటే ఎక్కువగా పడుకోవద్దు. ఆక్సిజన్ లెవల్స్ 94 శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలో ఈ ప్రోనింగ్ అవసరం.

కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినవి
భోజనం తర్వాత గంట వరకు ప్రోనింగ్ చేయకూడదు
ఈజీగా అనిపించేతవరకు మాత్రమే ప్రోనింగ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనే బలవంతంగా ప్రోనింగ్ చేయకూడదు. వీలును బట్టి దిండ్లనుకూడా మార్చుకోవచ్చు.
కొంతమంది ప్రోనింగ్ గురించి అవగాహన ఉండదు. కాబట్టి గాయాలపాలు కావచ్చు. సో అలాంటివాళ్లు కచ్చితంగా డాక్టర్లను సంప్రదించి చేయాలి.
గుండె, వెన్నెముక, గర్భిణీ సమస్యలతో బాధపడేవాళ్లు దూరంగా ఉండటం మంచిది.

ఆక్సిజన్ లెవల్స్ కు పోషకాలు ఇవే..
- విటమిన్ బీ2- 1.7ఎంజీ
- కాపర్- 2ఎంజీ
- విటమిన్ బీ6-2ఎంజీ
- విటమిన్ బీ5-10ఎంజీ
- ఐరన్-18ఎంజీ
- విటమిన్ బీ3-20ఎంజీ
- విటమిన్ బీ9-400మైక్రోగ్రామ్
- విటమిన్ ఏ-5000 ఇంటర్నేషన్ యూనిట్స్











