నటుడు, నిర్మాత, పరోపకారి సోను సూద్ తో పాటు అతని NGO సభ్యులు కూడా చాకచక్యంగా వర్క్ చేస్తున్నారు. ఇటీవల స్థానిక పోలీసుల బృందంతో కలిసి బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి (శ్రేయాస్ హాస్పిటల్) వద్ద ఆక్సిజన్ లీక్‌ను గుర్తించారు. ఆ స్పందనతో దాదాపు 30 కోవిడ్ -19 రోగుల ప్రాణాలు నిలిచాయి. లీక్ గుర్తించినప్పుడు సోను సూద్ బృందం తగినంత సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లతో ఆసుపత్రికి చేరుకుంది. రోగులకు ఆక్సిజన్ సరఫరా గంట మాత్రమే మిగిలి ఉంది.
ఆసుపత్రిలోని ఒక వైద్యుడు సమిత్ హవినల్ వెంటనే సంక్షోభం నుండి బయటపడటానికి సోను సూద్ ఫౌండేషన్, మేఘా చౌదరినీ, పోలీసు హెల్ప్‌లైన్ బృంద సభ్యులనూ సంప్రదించారు. పోలీసులు వచ్చినప్పుడు సోనూ సూద్ బృందం ఆస్పత్రిలో పనిలో ఉంది. తరువాత వారు సమీప ప్రాంతమైన పీన్యలోని ఇతర ఆసుపత్రుల్లోనూ, ఆక్సిజన్ ప్లాంట్లనూ సంప్రదించడం ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయడానికి తమ వంతు కృషి చేశారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, రీమా సువర్ణ, ఆసుపత్రి యాజమాన్యం సోనూ సూద్ బృందం క్లిష్టమైన పరిస్థితుల్లో వెంటనే స్పందించినందుకు ప్రశంసించారు.