November 10, 2026 8:12 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సంక్షేమం మాటున సంక్షోభం.. నిధుల పంపిణీలో తెలంగాణ, ఏపీ పోటా పోటి

లక్షల మందికి లబ్ధి చేకూర్చామనే అంకెలు చూపించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. వాటి కోసం అందినకాడికి అప్పులు చేస్తుండటంతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.

December 30, 2020 at 1:43 PM
in Andhra Pradesh, Editors Pick, General, Telangana
telugu states
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సంక్షేమ కార్యక్రమాల్లో అసలైన అర్హులు ఎంతవరకు ఉన్నారన్న విషయం పక్కన బెట్టి..ఇన్ని లక్షల మందికి లబ్ధి చేకూర్చామనే అంకెలు చూపించేందుకు ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. అప్పులూ చేస్తున్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. తెలంగాణ, ఏపీలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఉత్పాదక ఆదాయం తగ్గి ఆర్థికంగా వెనుకబడిన ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను పరస్పరం పోల్చిచూడడం..  ఈ పరిస్థితిని మరింత దిగజార్చేదిగా కనిపిస్తోంది.

నవరత్నాల పేరుతో నిధుల పంపిణీ

తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బల కారణంగా తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని సంక్షేమ పథకాల అమలుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అమలవుతున్న పథకాలను పరిశీలిస్తోందని, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్రాల్లోని పథకాలను కూడా పరిశీలిస్తోందని చెబుతున్నారు. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం గత ఏడేళ్లలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఉంది. రైతు బంధు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, పించన్లు, ఇలా పలు పథకాలు అమల్లో ఉన్నాయి.  ఇక ఏపీలో ఇప్పటికే నవరత్నాల పేరుతో నిధుల పంపిణీ జరుగుతోంది. ఇందుకోసం అప్పులు తీసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇలాగే కొనసాగితే రుణ సంక్షోభంలో రెండు రాష్ట్రాలు కూరుకపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పులపై పరిమితి ఉండేలా FRBM అమల్లో ఉన్నా.. ఏదో ఒక కారణం చూపి అప్పులు తెచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. వనరులు పెరగకుండా, ఉత్పాదక రంగాలను విస్మరించి కేవలం సంక్షేమంపైనే దృష్టి పెట్టడం ఏపీకి రానున్న కాలంలో శాపంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే పంథా కొనసాగితే రానున్న రెండు దశాబ్దాల పాటు రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి తెలెత్తుతుందని నిపుణులు చెబున్నారు.

తెలంగాణ పరిస్థితి వేరు..

సంక్షేమ పథకాల్లో ఏపీ తెలంగాణలు పోటీ పడి అప్పులు చేస్తున్నా తెలంగాణ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. హైదరాబాద్ తెలంగాణకు పెద్ద ఆర్థిక, పారిశ్రామిక వనరు. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అన్ని రంగాల్లో కలిపి ఏటా దాదాపు రూ.6లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ఉండడం, స్థిరాస్తి భూమ్ కలసి రావడంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితి వేరు. అంటే అప్పులు పెరిగినా సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం నుంచి కొన్ని చర్యల వల్ల బయటపడొచ్చు.  కాని ఏపీలో ఆర్థిక వనరులు పెద్దగా లేవు. అనుత్పాదకత రంగంతో పాటు అసంఘిత రంగాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ సమయంలో పెట్టుబడులను ఉత్పాదక రంగాల వైపు మళ్లించాల్సింది పోయి..సంక్షేమం వైపు మళ్లించడం మరో ఇబ్బందిగా మారింది.

ఏపీలో 50 శాతం అప్పులే..

తాజా గణాంకాల ప్రకారం ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో 50 శాతం పైచిలుకు అప్పులు తెస్తోంది. అప్పులు తీర్చేందుకు కొత్త పన్నులు విధించాల్సిన పరిస్థితిలోకి ఇప్పటికే వెళ్లింది ఏపీ. అప్పులు తెచ్చుకునేందుకు ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకర్లు విధిస్తున్న షరతులకు అంగీకరిచాంల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయిదువేల కోట్ల రూపాయల అదనపు రుణం తెచ్చుకునేందుకు కేంద్రం విధించే షరతులకు ఏపీ ఒప్పుకోగా తెలంగాణ మాత్రం ఆ షరతులను ఒప్పుకోలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే..రానున్న కాలంలో థర్డ్ పార్టీ అంటే కేంద్రం, కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకుల కన్సార్టియాలు లేదా ప్రపంచ బ్యాంకు వంటివి రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితి తలెత్తనుంది.

YS Jagan and KCRఅర్హులెందరు..

ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేయడాన్ని ఎవరూ కాదననరు. అది అవసరం కూడా. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి అండగా ఉండేందుకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అవసరం. రైతులు, ఆడపిల్లల సంరక్షణ, వైద్య సేవలు, అక్షరాస్యత శాతం పెంచడం లాంటి ప్రాధాన్య అంశాల్లో సంక్షేమ పథకాలు అమలు చేసి మిగతా వర్గాల్లోని వారికి కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే చర్యలు అవసరం. అయితే, అలాంటివి కాకుండా నేరుగా పంపిణీ ఎంతమేరకు ఉపయోగం అనేదే అసలైన ప్రశ్నగా మిగిలింది. పైన పేర్కొన్న రంగాలు కాకుండా ఇతర వర్గాల్లో ఉన్న వారిలో 20శాతం మందికి మాత్రమే ప్రభుత్వ చేయూత అవసరమనే నివేదికలు గతంలో వచ్చాయి. కాని ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు 80 శాతానికి కవర్ స్కోప్ ఉందనే అంచనాలున్నాయి. అంటే అవసరం లేనివారికి కూడా కేవలం అధికారాన్ని నిలబెట్టుకునేందకు నిధులు ఇస్తున్నారని చెప్పవచ్చు. గతంలో చాలా ప్రభుత్వాలు దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేశాయి. అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయాయి. అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, ముందుచూపు లేకుండా నియంత్రణ లేని వ్యయాలు, తప్పనిసరి పరిస్థితిలో చేసిన రుణాల కారణంగా వెనిజులా దేశ ఆర్థిక వ్యవస్థ పతనాన్ని ఇక్కడ ఉదాహరణగా చెప్పవచ్చు. ఒకప్పుడు సంపన్నదేశంగా ఉన్న వెనిజులా..ఇప్పుడు అత్యంత పేద దేశాల సరసన చేరేందుకు సమీపంలోనే ఉంది. ఆదాయ మార్గాలు పెంచుకోకపోవడం, ఉత్పాదక రంగాలను విస్మరించడం, ప్రజల్లో ఉపాధి సామర్థ్యాన్ని పెంచి జీవన ప్రమాణాల మెరుగును ప్రోత్సహించడానికి బదులు..ప్రభుత్వమే వారికి ఉచితంగా అన్నీ ఇవ్వడం లాంటి చర్యలు ఆ దేశాన్ని కోలుకోలేని సంక్షోంభంలోకి నెట్టాయి. చదివేందుకు ఇబ్బందిగా ఉన్నా.. కండోమ్‌ల ఖర్చు తట్టుకోలేక సెక్స్‌కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి, పిల్లలు పుడితే వారి కనీస ఖర్చులు భరించలేమనే పరిస్థితి, సంబంధీకులు చనిపోతే వారిని చూసేందుకు ప్రయాణ ఖర్చులు భరించలేని పరిస్థితి అక్కడ ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలూ వస్తున్నాయి.

అప్పుల తీరు ఇదీ..

తెలంగాణ రాష్ట్రం అప్పులు దాదాపు 3.5లక్షల కోట్లకు చేరగా ఆదాయ వనరులు పెద్దగా లేని ఏపీ కూడా ఇంచుమించు అదే బాటలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు వరకు బహిరంగ మార్కెట్‌ నుంచి ఏపీ రూ.31,250 కోట్ల రుణం తీసుకోగా తెలంగాణ రూ.22,961 కోట్లు సేకరించింది. 2018-19లో రూ.30,200 కోట్లు రుణం తీసుకున్న ఏపీ.. 2019-20లో తొలి ఏడునెలల్లోనే రూ.42,415 కోట్లు అప్పు చేసింది. తెలంగాణ 2018-19లో రూ.26,740 కోట్లు, 2018-19లో రూ.37,109 కోట్ల రుణం తీసుకుంది. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.3,53,596 కోట్ల రుణం తీసుకోగా అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా 8.83%, తెలంగాణ వాటా 6.49% మేర ఉందంటే అప్పులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీటి కంటే ముందు మహారాష్ట్ర, తమిళనాడులు ఉన్నాయి. అప్పుల పరంగా ఏపీ మూడో స్థానంలో, తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. మహారాష్ట్ర విషయానికి వస్తే ముంబై, పూణె  లాంటి నగరాలు మంచి ఆదాయ వనరులు. అక్కడి జనాభా, పరిశ్రమలు, ఉపాధి మార్గాలతో పోల్చితే ఏపీలో పరిస్థితి దారుణం. అయినా అప్పుల్లో పోటీ పడుతుండడమే ఆందోళనకరంగా కనిపిస్తోంది. నెలకు వడ్డీ రూపేణా రూ.700కోట్లు కట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉత్పాదకత, సంపద సృష్టి లేకుండా.. కేవలం సంక్షేమ పథకాల అమలు..దీర్ఘకాలంలో ఏ కోణంలోనూ క్షేమం కాదనే విషయాన్ని పాలకులు విస్మరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

అంతేకాదు.. ఇప్పటికిప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకున్నా.. ఇప్పుడు చేసిన అప్పుల నుంచి బయటపడడం, కొత్తగా అప్పులు చేయకుండా ఉండే పరిస్థితి రావాలంటే కనీసం రెండు దశాబ్దాల సమయం పడుతుందన్న అంచనా ఉందంటే… తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.

Tags: ap and telangana giving funds to diferent schemesap government is in great dangerap navaratnalu schemeap newseconomic condition is in dangerkcr and ys jaganlatest telangana newstelnagana shcemestelugu newstelugu states
Previous Post

5 అరెస్టులు సరే.. అసలు వాళ్ల సంగతేంటి?

Next Post

రంగనాథ్ అలా చేసి ఉండకూడదన్న పరుచూరి 

Related Posts

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

by లియో డెస్క్
November 10, 2026 6:15 pm

ఏపీ రాజకీయాల్లో మరో స్ఫూర్తిదాయక ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి కృష్ణాజిల్లా నూతన...

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

by లియో డెస్క్
November 10, 2026 5:34 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రూ. 500 నోట్ల రద్దు అంశం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా...

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

by లియో డెస్క్
November 10, 2026 4:47 pm

రాష్ట్ర విభజన గాయాలు, ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు... సంక్షేమం, అభివృద్ధిని పట్టాలెక్కించాల్సిన బాధ్యత...

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

by లియో డెస్క్
November 10, 2026 4:21 pm

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో మరో బిగ్ షాక్ తగిలిందా? అధినేత...

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

by లియో డెస్క్
November 9, 2026 8:50 pm

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఇప్పుడు ఒకే ఒక్క అంశం హాట్‌ టాపిక్‌గా...

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

by లియో డెస్క్
November 9, 2026 8:15 pm

టాలీవుడ్ సీనియర్ స్టార్, జగ్గూభాయ్ జగపతిబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు...

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

by లియో డెస్క్
November 9, 2026 7:10 pm

రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా, సోషల్ మీడియా వేదికగా ఎంత దుష్ప్రచారం...

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

by లియో డెస్క్
November 9, 2026 5:41 pm

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. కృష్ణా జిల్లా...

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

by లియో డెస్క్
November 9, 2026 4:51 pm

పల్లె సీమలే ప్రజాభిప్రాయానికి అసలైన అద్దం అని ఊరికే అనరు. స్థానిక సంస్థల...

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

by లియో డెస్క్
November 9, 2026 4:29 pm

ZPTC, MPTC కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ల గురించి వైసీపీ వర్గాలు పెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే వ్యక్తిని ఎంపీటీసీని చేసిన లోకేష్‌..

ముఖ్య కథనాలు

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

ఉమ్మడి కృష్ణా జిల్లా ZP పీఠంపై కోట పుల్లమ్మ.. TDP పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్..!

జగన్ రూ. 50 వేల కోట్ల సీక్రెట్‌ కరెన్సీ…ఇక చిత్తు కాగితాలే.?

ఏపీ.. ఇండియాలోనే నెంబర్‌ 2…!

కృష్ణా జిల్లాలో వైసీపీకి కీలక నేత గుడ్‌ బై..?

అబ్బాయి.. బాబాయ్‌ వెన్ను పోటు… టీడీపీతో వైవీ లాలూచీ…!

నేను పచ్చా చొక్కా మనిషిని.. బాబు గారికి వీర ఫ్యాన్‌ని.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సంచలనం..

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తులసీ చంద్, తెలకపల్లి…. సోషల్ మీడియా స్టార్ల నోరు మూయించిన చంద్రబాబు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా MPP.. సైకిల్ గుర్తుపై సామాన్యుల సంచలనం..!

ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు….. ఫ్యాన్ గాలి తీసేసిన పల్లెలు.!

తేల్చేసిన ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్‌లో ఊహించని ఫలితాలు..బాబు, లోకేష్‌, పవన్‌ షాక్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist