లోకనాయకుడు కమల్ హసన్ .. కొద్దిరోజుల విరామం తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసుకున్న సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే వెరైటీ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. రెండు నెలల కిందటే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. నెల రోజుల షెడ్యూల్ లో కొన్ని ముఖ్యమైస సీన్స్ చిత్రీకరణ జరిగాయి. వాటినే కమల్ బర్త్ డే రోజున టీజర్ గా వదిలాడు. ఆ తర్వాత కమల్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు.
తమిళనాడు ఎన్నికల్లో కమల్ పోటీ చేస్తున్న నేపథ్యంలో .. ఆ ప్రచార కార్యక్రమాల్లో ఆయన మళ్ళీ బిజీ అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ విక్రమ్ చిత్రం షూటింగ్ లో పాల్గొంటారు. ఇక ‘విక్రమ్’ సినిమాలో కమల్ హాసన్ కు ధీటుగా విలనిజం పండించడానికి లోకేష్ .. రాఘవ లారెన్స్ ను రంగంలోకి దింపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. లారెన్స్ ప్రస్తుతం తాను దర్శకత్వం వహించే చిత్రాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను విక్రమ్ సినిమా కోసం లోకేష్ ఒప్పించినట్టు సమాచారం. మరి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే.. ఈ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ ఆగాల్సిందే.
Must Read ;- శ్రుతి ప్రేమికుడి కుంచె నుంచి కమల్ విశ్వరూపం











