ప్రేమ ఎప్పుడూ మధురంగానే ఉంటుంది. అది వికటించనంతవరకూ ఒకరికొకరు లోకంగా బతుకుతారు. విశ్వనటుడు కమల్ హాసన్ తనయ శ్రుతి హాసన్ ప్రేమ ఇప్పుడు వార్తల్లో వైరల్ అవుతోంది. ఆమె తన ప్రియుడితో కలిసి ఫొటోలు షేర్ చేయడం, ఆ ప్రియుడు కూడా ఆ స్థాయిలో శ్రుతి పట్ల, ఆమె తండ్రి పట్లా అదే అనురాగాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అతను మరెవరో కాదు డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా. వీరిద్దరూ చెట్టపట్టాలేసుకు తిరుగుతున్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇద్దరూ కౌగిలించుకుని ఫొటోలు పెడుతున్నా తమ మధ్య ప్రేమ వ్యవహారం లాంటిది సాగుతున్నట్లు ఎప్పుడూ అధికారికంగా వెల్లడించలేదు. శాంతను చెన్నైకి వచ్చి కమల్ హాసన్ ను కూడా కలిశారు. అంతేకాదు ఆయన ఊహించని బహుమతిని కూడా అందించాడు. ఆ బహుమతి కమల్ ఫొటో. ఓ చేత్తో గొడ్డలి, మరో చేత్తో టార్చిలైట్ పట్టుకుని ఉన్నట్టు కమల్ ఫొటోను చిత్రీకరించారు. కమల్ ఇప్పుడు రాజకీయ నాయకుడు కూడా కావడంతో తమిళ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫొటో రూపొందించాడు.
రాజకీయ ప్రక్షాళన చేయడానికి వచ్చిన అరివీర భయంకరుడిగా కమల్ ను చూపించే ప్రయత్నం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల్లో కమల్ విశ్వరూపం ఇదని అనుకోవాలి. కమల్ కు కూడా ఈ చిత్రం ఎంతో ఆక్టుకోవడంతో దాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. శాంతను తో శ్రుతి ప్రేమ ప్రయాణం ఎంత దాకా కొనసాగుతుందో వేచిచూడాలి.
View this post on Instagram