June 28, 2026 7:08 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మా గోడు.. గోవిందుడుకే మోరపెట్టుకుంటాం..!

అమ‌రావ‌తిని ప‌రిర‌క్షించుకునే క్ర‌మంలో రాజ‌ధాని రైతులు ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ మ‌హాపాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌నున్నారు.

October 28, 2021 at 10:42 AM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అన్నంపెట్టే భూమిని సైతం భవిష్యత్తు తరాలకోసం ధారదత్తం చేశారు ఆ ప్రాంత రైతులు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మించి తీరుతాం .. మీ భవిష్యత్తే కాదు.. రాష్ట్ర భవిత కూడా బాగుంటుందని రైతుల నుంచి భూసమీకరణ ద్వారా సింహభాగం, సేకరణ ద్వారా కొంత భాగం వ్యవసాయ భూములు రమారమి 34 వేల 320 ఎకరాల పైచిలుకు సేకరించారు. రైతు ప్రయోజనాలకు పెద్దపీట, కౌలు పరిహారం, రిటర్నబుల్ ప్లాట్స్ వంటి స్పష్టమైన అంశాలతో నాటి ప్రభుత్వం ముందుకురావడంతో 29 గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో బయటకొచ్చి రాజధాని నిర్మాణానికి భూములిచ్చారు. ఆ తరువాత అది సరిగ్గా 2019, డిసెంబర్ 17 న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు ఆశలకు, ఆకాంక్షలకు రివర్స్ గేర్ వేసి అథఃపాతాళానికి తొక్కిన మాదిరిగా మూడు రాజధానుల మంత్రాన్ని అందుకున్నారు. నాటి నుంచి నేటి వరకు జగన్ ఆడుతున్న మూడు ముక్కలాటలో రైతులతో పాటు, అనేక పారిశ్రామిక కారిడార్లు, నిర్మాణ రంగ సంస్థలు, రియల్ ఎస్టేట్, స్టార్ట‌ప్‌ కంపెనీలు, విదేశీ సంస్థల పెట్టుబడులు, జాతీయ విద్యా సంస్థలు.. ఇలా చెప్పుకుంటూ పోతే కీల‌క‌ రంగాలన్నీ చిత్తై పోయాయి. నేటికి ఆ నష్టాలను పూడ్చుకోవాడానికి ఏపీని వదిలి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు చివరకు ఖండాలను దాటి మరి తరలిపోవాల్సిన పరిస్థితి పట్టింది. ఆయా రంగాలకు. కానీ వ్యాపారం, మోసం, దగా, నయవంచన, మాటతప్పడం, దిగజారి బ్రతకడం, అవకాశవాదం వంటి అష్టదరిద్రాలు తెలియని రైతు మౌనంగా భూములిచ్చిన ప్రాంతంలోనే దీక్షలు చేస్తూ ఉండిపోయాడు. అవకాశవాదం యొక్క తీరు తెన్నెలు తెలియని రైతు భావితరాల భవిష్యత్ కోసం రాజధాని తరలింపును నిరసిస్తూ ఆనాటి నుంచి నేటి వరకు 680 రోజులు దీక్షలు చేస్తూ తన నిరసనలను వివిధ రూపాల్లో తెలుపుతునే ఉన్నాడు.

‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పేరుతో మహాపాదయాత్ర

ప్రజా రాజధాని పేరుతో బీజం పడిన రైతు కలల రాజధానిని కాపాడుకోవడానికి ఏడాదిన్నర నుంచి న్యాయ స్థానం మెట్లెక్కారు. కేసులు వేశారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేశారు. కానీ నేటికి ఫలితం దక్కలేదు. నిత్యాగ్నిహోత్రంలా దీక్షలు చేస్తున్న రైతుల గోడు కూతవేటు దూరంలో ఉన్న ముఖ్యమంత్రికి కనిపించకపోయినప్పుటికీ.. అంతర్జాతీయ సమాజానికి రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే రైతు నిరసనలు సమర్ధనీయమని ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మద్దతే. ఈ క్రమంలో 680 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు ప్రభుత్వం నుంచి కొరవడిన స్పందన చూసి జేఏసీ నేతలు, రైతు సంఘాల నాయకులు పాదయాత్ర తలపెట్టాలని తలిచారు. నవంబరు 1 నుంచి డిసెంబర్ 17 వరకు అంటే 45 రోజులు పాటు ‘న్యాయస్ధానం టూ దేవస్థానం’ నిరసన ట్యాగ్ లైన్ తో మహాపాదయాత్రకు జేఏసీ రూట్ మ్యాప్ ను సిద్ధం చేసింది. ఈ పాదయాత్రలే కొందరిని ముఖ్యమంత్రులను చేస్తే .. మరికొందర్ని మంచి లీడర్ గా కూడా తీర్చిదిద్దింది. ఈ పాదయాత్రతోనే ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయితే .. ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పాదయాత్రతో ఏపి పాలన పగ్గాలు చేపట్టాడు.

మహాపాదయాత్రకు ‘రోడ్ మ్యాప్’ ఇలా..

అమరావతినే రాజధాని కొనసాగించాలంటూ అందుకున్న రైతు నినాదం.. సుదీర్ఘ దీక్షలుగా మారి సరిగ్గా రెండు నెలలకు తక్కువ రెండేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు ‘న్యాయ స్థానం టూ దేవస్థానం’ పేరుతో మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు సాగే మహాపాదయాత్ర తుళ్లూరు నుంచి ప్రారంభం కానున్నది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను కలుపుకుంటూ పాదయాత్ర సాగి.. చివరకు తిరుమల శ్రీవారి చెంతకు చేరుకుంటుంది. ఈ పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలుపుకుపోతూ.. గ్రామగ్రామాన ప్రభుత్వ విధానాలను, వైఫల్యాల వైఖరిని తెలియచెప్పాలని భావిస్తోంది. అమరావతి జేఏసీ, రైతు సంఘాల నాయకులు తలపెట్టిన ఈ పాదయాత్రకు ఇప్పటికే తెలుగుదేశంపార్టీతోపాటు, జనసేన, సీపీఐ, సీపీఎం, దళిత జేఏసీలు మద్దతు ప్రకటించాయి. ముందుగా పాదయాత్ర తుళ్లూరు నుంచి తాడికొండ ఆ తరువాత గుంటూరు, అక్కనుంచి ఒంగోలు, నెల్లూరు, కావలి, శ్రీకాళ‌హస్తి, రేణిగుంట, తిరుపతి మీదిగా తిరుమల శ్రీవారి చెంతకు చేరడంతో ముగుస్తోంది.

అనుమతిపై డైలమాలో డీజీపీ ..

నవంబరు 1 నుంచి రైతులు తలపెట్టిన పాదయాత్రకు ప్రభుత్వ అనుమతులతోనే అంతా ముడిపడి ఉంది. అనుమతులు కోరుతూ.. అమరావతి జేఎసీ, రైతుల సంఘాల నాయకులు డీజీపీ గౌతం సవాంగ్ కు వినతి పత్రం సమర్పించారు. కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతులు దాఖాలు చేసిన పిటిషన్ ను విచారణ జరిపి, నవంబరు 01 న తలపెట్టిన ‘న్యాయ స్థానం టూ దేవస్థానం’ పాదయాత్రకు అనుమతిపై అక్టోబరు 28 సాయంత్రం 5 గంటల లోపు నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. అనుమతులిచ్చే విషయంపై ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. దీంతో కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా డీజీపీ సవాంగ్ డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని జేఏసీ నేతలు ప్రకటించారు.

Tags: #TheLeoNewsamaravathiandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicscpicpmdalith jacjanasenaLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotopmahapadayatrarajadhani farmerstdptelugu newsthe leo newstirumala
Previous Post

రాధేశ్యామ్ టీజర్ వ్యూస్ ఆగిపోవడానికి కారణం ఇదే

Next Post

పొడుస్తున్న పొత్తులు.. పలాయనంలో ఫ్యాన్ పార్టీ!

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Tamannaah Bhatia looks gorgeous in a pink dress ,photos viral

మనిషి తలరాతలు తాళపత్రాల్లో రాసి ఉంటాయా?

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist