అది 2014 .. మోదీ, చంద్రబాబు ధ్వయం ఏపిలో టీడీపీని, ఢిల్లీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి సర్వశక్తులను ఒడ్డుతున్న రోజులవి. ఇరువురు చేసే ప్రతి ప్రయత్నం ఆనాడు సెంటిమెంట్ గా వర్కౌట్ అయ్యింది. వీరిరువురికి తోడుగా ఏపీలో యువ నాయకుడు జట్టు కట్టడంతో టీడీపీ విజయం నల్లేరుపై నడక మాదిగా సాగింది. ఈ ముగ్గురి కాంబినేషన్ ఆనాడు ఎన్నికల్లో ప్రదర్శించిన తీరు నేటికి ప్రజలకు గుర్తే ఉంది. మోదీ రాజకీయ చతురత, ప్రజాబాహుళ్యంలో చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకం, పవన్ సామాజీక ఉద్యమ తెగింపు వంటివి ఆనాడు చంద్రబాబు గెలుపునకు హైలెట్స్ గా కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ శూన్యత విస్పష్టంగా కనిపిస్తున్న వేళా అనుభవానికి, సమర్థతకు, ధార్మినికతకు మరోసారి పట్టంకట్టే అవకాశం లేకపోలేదన్న భావన సర్వత్ర వ్యక్తమౌతోంది.
ఆత్మపరిశీలన అవసరం.. అదే జాతికి శ్రేయష్కరం
బీజేపీ.. సిద్దాంతాలకు, దేశ సమగ్రతకు, జాతి ప్రయోజనాలకు అధిక ప్రయార్టీ ఇస్తుంది. మచ్చలు, మరకలు, అవినీతి ఉచ్చులకు చాలా దూరంగా ఉంటుంది కూడా. అటువంటి ఆ పార్టీ ఈ సారి సార్వత్రికంలో కాస్తా ఆచీతూచీ అడుగులు వేస్తోందన్న సంకేతాలు బలంగానే వినిపిస్తున్నాయి. రెండున్నరేళ్ల పాలనలో దేశంలో ఏ ముఖ్యమంత్రి మూటకట్టుకోలేనన్నీ వైఫల్యాలు, విఫలమైన అడ్మినిస్ట్రేషన్ వంటివి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చవిచూపారు. ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలు, అనాలోచిత నిర్ణయాల వలన ఎదురయ్యే వైఫల్యాలు, ఒంటెత్తుపొకడలతో తలెత్తే లీగల్ ఇష్యూస్, నియంత వ్యవహార శైలితో ప్రజల ఛీత్కారాలు, లెక్కాజమ లేకుండా చేస్తున్న అప్పుల నుంచి కుంటుపడుతున్న ఆర్థిక వ్యవస్థ వంటివి అనేకనేకాంశాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. అదేరీతిగా సామాజీక మాధ్యమాల్లో ఏకిపారేస్తున్నది వాస్తవం కాదా?. ఇవన్నీ హస్తినలోని పెద్దలకు, ఏపీలో ఉన్న కాషాయ శ్రేణులకు తెలియనివి కావు. ప్రస్తుతం ఏపీలో గాడి తప్పిన పాలన, సర్వత్ర వైఫల్యాలను నిశితంగా పరిశీలిస్తూ.. అవకాశం కోసం ఎదురుచూస్తోంది బీజేపీ అధిష్టానం. ఈ తరుణంలోనే ఏపీలో పట్టు నిలపెట్టుకోవడానికి, పార్టీతో ప్రజలకున్న అంతరాన్ని చెరిపేడానికి బీజేపీ గత కొంతకాలంగా నిశ్శబ్ధ తంత్రాన్ని ప్రయోగిస్తుంది. బీజేపీ చిరకాల మిత్రుడు చంద్రబాబు, ఆత్మబంధువు పవన్ తో ఏపీలో పావులు కదిపేందుకు ఆత్మపరిశీలన చేసుకుంటోందన్నది నిశ్శబ్ద తంత్రంలోని సారాంశం. అది ఏపీకే కాదు, బీజేపీకి కూడా శ్రేయష్కరమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
బాబు ఢిల్లీ టూర్.. యాక్టివ్ పాలిటిక్స్ షురూ..
ఏపీ ప్రస్తుతం గంజాయి ఉత్పత్తి కేంద్రంగా, డ్రగ్స్ డంపునకు అడ్డాగా మారిందన్న తమ్ముళ్ల వాదనను.. అది నిజమేనని జనసేనాని బలంగా ప్రతిపాదిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తున్న వారిపై కేసులు, నోటీసులు అంటూ భయోత్పాతానికి తెరతీసింది అధికార పార్టీ. దీనికి కౌంటర్ ఎటాక్ లా అధికార పక్షంపై గుంటూరు జిల్లా నుంచి ప్రారంభమైన వ్యతిరేఖ బావుటా.. పిడిని సరిచేసుకుని యుద్ధం ప్రకటించింది. ఆ రణ రంగంలో సేనాని పాత్రను పట్టాభి పోషించడంతో మరింతగా ఉలిక్కిపడ్డ ‘ఫ్యాను పార్టీ’ చారిత్రాత్మక తప్పిదానికి పురికొల్పింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు యావత్ దేశంలో అనేక రాజకీయ ప్రాంతీయ పార్టీ పుట్టుకొచ్చాయి సరే. అందులో ప్రాధన్యత అవసరతలకు కొన్నిపార్టీలు, అవకాశవాదంతో మరికొన్ని పార్టీలు ఉద్భవించాయి. ఇలా ఎన్నో రంగురంగు జెండాలు, గుర్తులు వచ్చినప్పుటికీ.. నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు.. అవాకులు, చెవాకులు.. తిట్లు, రివర్స్ పంచ్ లకే పరిమితమయ్యేవి. అయితే కొంతకాలంగా రాజకీయం ముదిరి ఊరసవెల్లి మాదిరిగా తయారైంది. వ్యక్తి గత దూషణలకు, భౌతిక దాడులకు దిగుతోంది. అది మంచి పరిణామం కాదన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా తెలుసుకోలేని అజ్ఞానంలో పార్టీలు జోగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు ముకుమ్మడిగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటం.. దానిని ఖండించి చంద్రబాబు దీక్షకు దిగడం, ఆ తరువాత ఢిల్లీ పెద్దలను కలవడం వంటి స్టెప్స్ పార్టీకి, పార్టీ కేడర్ కు కలిసొచ్చే అంశంగా చెప్పుకోదగినవి. ఢిల్లీ టూర్ లో ఏపీలో జరుగుతున్న అనేక పరిణామాలను, ప్రభుత్వ విధివిధాలను పూసగుచ్చినట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు, ఫోన్ ద్వారా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు పూర్తిగా అర్థమయ్యేలా చెప్పడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఫైనల్ గా ఏపీలో అధికార పార్టీని ఒంటర్ని చేయడంలోనూ, అడుగడుగునా చేస్తున్న తప్పిదాలను బాహ్య ప్రపంచానికి చూపడంలోనూ టీడీపీ విజయం సాధించిందనే చెప్పవచ్చు. దీంతో ఏపీలో పాగా వేయాలనుకునే బీజేపీకి చంద్రబాబు, పవన్ తప్పనిసరే అన్న రాజకీయావసరం కనిపిస్తోంది.
దరిద్రం గంగ్నమ్ డ్యాన్స్ చేస్తునప్పుడు చేతులెత్తేస్తే ఎలా?
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన బాధ్యతలు స్వీకరించిన దరిమిలా నేటివరకు నవరత్నాలు, మేనిఫెస్టోలో లేని అవకాశవాద హామీలు, వీటికి తోడు ఉచితాల పరంపర కాస్తా.. రాష్ట్ర భవితవ్యాన్ని అప్పుల ఊబిలో నెట్టేసింది. పెను అర్థిక భారాన్ని టన్నుకొలది రాష్ట్ర ప్రజలపై మోపారన్నది ఆర్థిక నిపుణుల అధ్యయానాల సారం. పథకాల అమలుకు, ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు ఫెన్సన్లు, సామాజీక ఫించన్ల కలిపి ప్రతినెల రమారమి రూ.16 వేల కోట్ల పై చిలుకు బడ్జెట్ అవసరం. వీటి సర్ధుబాటుకి సర్కారు చేస్తున్న ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. వీటితోపాటు సంక్షేమ పథకాల అమలుకు వేల కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తైతే .. అభివృద్ధి మరోవైపు సుప్తచేతనావస్థల్లో కొట్టుమిట్టాడుతున్నది మరో ఎత్తు. ఇదీ ప్రస్తుతం ఏపీ ముఖచిత్రం. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు కాదా? వీటిపై ప్రశ్నిస్తున్న పబ్లిక్ పైనా, సామాజీక కార్యకర్తలపైనా, మీడియాపైనా, ప్రతిపక్షాలపైనా కేసు కడుతూ.. నోటీసులిచ్చి వేదింపులకు గురిచేయడం చారిత్రక తప్పిదాలు కావా? అని విశ్లేషకుల వాదనలు. గడిచిన రెండునరేళ్ళ పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టులో వేయించుకున్న మొట్టికాయల లెక్క ఎప్పుడో సెంచరీ దాటింది. అయినా.. కొద్దిపాటి స్పృహ కూడా లేకుండా ప్రశ్నించిన ప్రతిపక్షాలపై బూతుల పురాణాలు అందుకుని, భౌతిక దాడులకు దిగుతున్న నాయకులను ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఖండించకపోగా.. వత్తాసు పలకడమన్నది ఒక దౌర్భాగ్య చర్యేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా దరిద్రం గంగ్నమ్ డ్యాన్స్ చేస్తున్నప్పటికీ చేతులెత్తేసి తమాషా చూస్తే ఎలా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాగిస్తున్న పాలన కథా చిత్రం అసాంతం చూస్తే మిడిమిడి రాజకీయ జ్ఞానం ఉన్నవారికి కూడా ఇట్టే అర్థమవుతోంది జగన్ వైఫల్యాలు చిట్టా. ప్రజాస్వామ్యబద్ధంగా అధికార పగ్గాలు జగన్ చేజిక్కించుకున్నప్పటికీ .. స్టీరింగ్ మాత్రం ఏపీ హైకోర్టు చేతులోనే ఉందన్నది అక్షర సత్యం.
పునారాలోచనే బెటరంటున్న సర్వేలు
ఏ రాజకీయ పార్టీకైనా వాటి బ్రతుకు చిత్రం ఆవిష్కరించేవి సర్వేలే. ఈ సర్వేలే అధికార పార్టీ పాలన ఫెయిల్యూర్స్ కూడా అద్దం పడతాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోతే 15 స్థానాల్లో కూడా బలంగా ఫైట్ ఇవ్వలేరు అన్నది అధికార పార్టీకి సర్వేలు చెబుతున్న సందేశం. అంతగా ప్రజాగ్రహన్ని టన్నులకొద్ది మూటకట్టుకుంది జగన్ ప్రభుత్వం. ఇది సర్వత్ర వినిపిస్తున్న విమర్శలు కాదు.. ఇదే రేపు జరగబోయే జోస్యం అని రాజకీయం, ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్న కఠోర నిజాలు. అన్నివిధాలుగా వైఫల్యాలు చెందిన అధికార పార్టీని మిత్ర పక్షంలా సరసన కూర్చోపెట్టుకుని ఎన్నికలకు పోయే సాహసం బీజేపీ చెయ్యబోదు అని రాజకీయ విశ్లేషకుల నుంచి బలంగా వినిపిస్తున మాట. సిద్దాంతాలు, ఎథిక్స్, మోరల్స్ ను ఎక్కువగా పాటించే బీజేపీకి ఫ్యాను పార్టీతో సయోధ్య అన్నది నేతి బీరకాయ చందమే అన్న వాదన కూడా లేకపోలేదు. మరోవైపు బీజేపీ భావజాలానికి కాస్తోకూస్తో దగ్గర ఉంది టీడీపీ పార్టీనే. అందుకు ఉదాహణే టీడీపీని వీడి కొందరూ బీజేపీ గూటికి చేరితే ..మరికొందరూ బీజేపీని వీడి టీడీపీలోకి వచ్చి స్థిరపడిపోవడం. కానీ ఇరు పార్టీలకు చెందిన నాయకులు చాలా రేర్ గా వైసీపీలో చేరిన వైనాన్ని కూడా ఇక్కడ గమనంలోకి తీసుకోక తప్పదు. ఏదిఏమైన ఏపీలో కాకరేపుతున్న రాజకీయాలు చలికాచుకోవడం మాని .. సరైన రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగేతే సో బెటర్ అంటున్నాయి నాటి సర్వేలు.