అరెస్ట్ ఎలా చేస్తారా?
గత ఏడాది మే నెలలో వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్టరాజును పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆయనపై 124(A) ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు, 153(B) వర్గాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, 505 IPC బెదిరింపులకు పాల్పడటం, 120 (B) కుట్రపూరిత నేరం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి, చిత్ర హింసలు గురిచేశారన్నది వాస్తవం! ఆయన ఆరెస్ట్ చేసిన తరువాత బెయిల్ పై బయటకొచ్చారు. ఏపీ ప్రభుత్వం, సీఐడీ చర్యలను ఎండగడుతూ.. రఘురామ సుప్రీం ను ఆశ్రయించాడు. అయితే రఘురామను అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం హైదరాబాద్ లోని రఘురామ ఇంటికి వెళ్లిన ఏపీ సీఐడి, ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చాం అని చెప్తున్నారు. గతంలో ఉన్న కేసులలో ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని నోటీసులు సారాంశం. విచారణ కు హాజరుకాకుంటే, సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అరెస్ట్ చేస్తారా? అన్నది చూడాలి. ఇదిలా ఉంటే గత కొన్నిరోజులుగా రఘురామ ఎంపీ పదవీకి రాజీనామా చేస్తానని, నాపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నారు. అలానే సంక్రాంతి పండుగకు తన స్వస్థలం వేళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ నోటీసులు ఇవ్వడంపై చర్చకు దారితీస్తున్నాయి.