టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ఆయన ప్రత్యర్ధులు విష ప్రచారాన్ని చేస్తుంటారు.. ఇచ్చిన హామీలను ఆయన పట్టించుకోరని ఆరోపిస్తారు.. ఆయన నెరవేర్చిన హామీలను మాత్రం లైట్ తీసుకుంటారు.. వాటిపై ఒక్క మాట కూడా మాట్లాడరు.. నోటికి తాళం వేసుకుంటారు.. చంద్రబాబు 4.O ఎవరూ ఊహించని రేంజ్లో దూసుకుపోతోంది.. ఆయన చెప్పారంటే చేస్తున్నారంతే… ఆయన మాట అక్షరాలా అమలవుతోంది.. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఆరు నెలల్లోనే పట్టాలెక్కి కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది..
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు కట్టి బరిలోకి దిగిన టీడీపీ రికార్డు మెజారిటీతో విక్టరీ కొట్టేసి కూటమి సర్కారును ఏర్పాటు చేసింది. అనుకున్నట్లుగానే టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి మరోమారు ఏపీకి సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. ఎన్నికల్లో హామీఇచ్చిన మేరకు పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నెలలకు సంబంధించిన పెంచిన పెన్షన్ మొత్తాన్ని కలిపి జూలైలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి మండలం పెనుమాకలో పింఛన్ల పంపిణీని చంద్రబాబు ప్రారంభించారు.
ఈ క్రమంలో గ్రామంలో పూరి గుడిసెలో నివాసం ఉంటున్న బాణావత్ పాములు నాయక్ కుటుంబాన్ని సందర్శించిన చంద్రబాబు… ఆ కుటుంబంలోని పింఛన్ దారులకు సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా వారు పూరి గుడిసెలో నివాసం ఉంటున్న వైనం, అందుకు దారి తీసిన పరిస్థితులు. పూరి గుడిసెలో వారి జీవన కష్టాలను తెలుసుకుని చలించిపోయారు. అంతే… అక్కడికక్కడే వారికి భరోసా ఇస్తూ… అతి త్వరలోనే పూరి గుడిసెను డాబా ఇల్లుగా మార్చేస్తానని హామీ ఇచ్చారు. వెంటనే వారికి డాబా ఇంటి మంజూరు పత్రం అందజేశారు.
సరే.. చంద్రబాబు ఈ హామీ ఇచ్చి అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. పాములు నాయక్ కుటుంబం, వారి ఇరుగుపొరుగు మినహా మిగిలిన వారంతా చంద్రబాబు హామీని మరిచిపోయారు. అప్పుడప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసిన విపక్షాలు పాములు నాయక్ హామీని చంద్రబాబు అమలు చేయరంటూ పరిహాసమాడాయి. ఇచ్చిన హామీ మేరకు 6 నెలలు తిరక్కుండానే పాములు నాయక్ పూరి గుడిసెను చంద్రబాబు సర్కారు డాబాగా మార్చేసింది. ఇంటి నిర్మాణం దాదాపుగా పూర్తి అయిపోయింది.
జనవరి రెండో వారంలో పాములు నాయక్ కుటుంబం చంద్రబాబు సర్కారు కొత్తగా కట్టించిన డాబా ఇంటిలోకి గృహ ప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అంటే… ఏదో ఓ డాబా ఇల్లే కదా… ఇలా హామీ ఇచ్చేస్తే సరిపోతుంద కదా… అంటూ చంద్రబాబు దానిని ఈజీగా తీసుకోలేదు. ఇచ్చిన హామీని చాలా తక్కువ సమయంలోనే అమలు చేసి తీరాలన్న కసిని చూపించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి రికార్డు సమయంలోనే పూరి గుడిసెను డాబా ఇల్లుగా మార్పించారు. హామీలు ఇవ్వడంలోనే కాదు… వాటిని రికార్డు సమయంలో అమలు చేయడంలోనూ తనకు తానే సాటి అని చంద్రబాబు నిరూపించుకున్నారు.