కొందరి జాతకం అంతేలే అంటే నిజమే అని అనేలా సరిగ్గా సరిపోతోంది. జగన్ పుణ్యమాని పదే పదే కేసుల్లో ఇరుక్కునే ఐఏఎస్ ఎవరు .. అంటే ఏపీలో టక్కును గుర్తుకు వచ్చేది మాత్రం ఆమే.
ఏపీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ… జగన్ అక్రమాస్తుల జైలు శిక్ష అనుభవించి.. బెయిల్ పై బయటకొచ్చారు. శ్రీలక్ష్మీ.. మరోసారి ఏపీ సీఎం జగన్ వలన కేసుల్లో ఇరుక్కోబోతున్నారా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. గతంలో ఓబుళాపురం మైనింగ్ లో అవకతవకలు జరిగియని ఆరోపణలపై ఎక్కువ కాలం జైలు శిక్షను అనుభవించిన ఐఏఎస్ అధికారిగా శ్రీలక్ష్మీ అందరికీ సుపరిచతమే. అయితే.., బెయిల్ పై వచ్చిన తరువాత తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి రిలీవ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా శ్రీలక్ష్మీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని రైతుల తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో శ్రీ లక్ష్మీపై ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర విభజన తరువాత రాజధాని ఏపీకి దాదాపు 50 వేల ఎకరాలను ఇచ్చి.. ప్రజా రాజదానికి పునాధులుగా నిలిచిన రైతులను జగన్ ప్రభుత్వం అత్యంత దయనీయంగా హింసిస్తోంది. మూడు ముక్కల రాజధాని ఆటతో రైతుల త్యాగాలను సర్వనాశనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి భూములిచ్చిన రైతులకు పదేళ్ళపాటు వార్షిక కౌలు చెల్లించాల్సి ఉంది. గడిచిన ఎనిమిదేళ్లుగా వార్షిక కౌలు చెల్లించిన ప్రభుత్వం.. తొమ్మిదొవ ఏడాదికి సంబంధించిన కౌలును ఆరు నెలలు గడుస్తున్న ఇంకా చెల్లించలేదని రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు రైతులకు కౌలు చెల్లించాలని ఆదేశించింది.
కానీ కోర్టు ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోలేదు. సంబంధిత అధికారిగా ఉన్న శ్రీలక్ష్మీ రైతు అవేదన పట్టించుకోవడం లేదని.. కనీసం కోర్టు ఆర్డర్ ను సైతం పెడ చెవిన పెడుతున్నారని ఆరోపిస్తూ తుళ్ళూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రైతులు. కౌలు చెల్లించడంలో ప్రభుత్వాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.. తద్వారా తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలా మరోసారి జగన్ పుణ్యమాని ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ మరోసారి కోర్టు మెట్లు.., ఆ తరువాత జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదా అన్న విశ్లేషణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.