విశాఖలోని రుషికొండపై మాజీ సీఎం జగన్‌రెడ్డి.. ఏరీ కోరి రాజకోట లాంటి ప్యాలెస్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల ప్రజా ధనాన్ని.. జగన్‌రెడ్డి తాతల ఆస్తిలాగా.. విలాసవంతమైన ప్యాలెస్ నిర్మాణానికి ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ భవనాలను రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్యాలెస్‌ని ప్రైవేటు హోటల్స్‌కి అద్దెకివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లీలా ప్యాలెస్, అట్మాస్ కోర్, తాజ్ హొటల్స్ వంటి సంస్థలు రుషికొండ భవనాలను టేకోవర్ చేయడానికి ముందుకొచ్చాయి. కానీ ఈ భవనాలు హొటళ్లకు అనుకూలంగా లేవని ఆ సంస్థలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి.
రుషికొండ కింద మొత్తం 9 ఎకరాలు భూమి ఉంది. అయితే ఇందులోని ఏడు ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. తీర ప్రాంత పరిరక్షణ నియమాలు కొత్త నిర్మాణాలకు అడ్డుగా ఉన్నాయి. అందుకే సమీపంలో స్థలం కేటాయించాలని.. రుషికొండ ప్యాలెస్‌ని అద్దెకు తీసుకోవడానికి ముందుకొచ్చిన సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. కొత్తగా కొంత స్థలం ఇస్తే.. అందులో హోటల్ నిర్మించి.. రుషికొండ ప్యాలెస్‌లో భాగంగా కట్టిన భవనాలను ప్రెసిడెన్షియల్ స్వీట్.. కన్వెన్షన్ సెంటర్లు.. సెమినార్ హాల్స్ వంటి అవసరాలకు వినిగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
రుషికొండ భవనాలపై ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ చర్చించారు. త్వరలోనే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. రుషికొండ ప్యాలెస్‌లోని చివరి రెండు బ్లాకులను ప్రభుత్వం ఆధీనంలోనే ఉంచాలని డిసైడ్ చేశారు. వీటిలో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసి.. ప్రజల కోసం సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలోచన లేని పాలకులు ప్రభుత్వ సొమ్మును సొంత విలాసాల కోసం దుబారా చేస్తే.. ఎలాంటి సమస్యలు వస్తాయో చెప్పడానికి రుషికొండ భవనాలు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నాయి.











