యంగ్ టైగర్‌గా పేరున్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్లోనూ సూపర్ హిట్‌గా దేవర కొనసాగుతోంది. దేవర సూపర్ హిట్‌కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు సైతం తన వంతు సహకారం అందించారు. అదేంటీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరకి ఎలా సహకారం అందించారనే సందేహం వస్తుందా? దేవర సినిమా రిలీజ్ కంటే ముందే అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇటు తెలంగాణలోనూ అదనపు షోలు వేసుకోవడానికి ముఖ్యమంత్రులు అనుమతి ఇవ్వడమే కాకుండా.. ఏపీలో సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీంతో దేవర సూపర్ హిట్లో తాను భాగస్వామ్యం కాగలిగారు చంద్రబాబు.
దేవర సినిమాకి టికెట్ల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ధన్యవాదాలు తెలిపారు. దేవర మూవీ విడుదల కోసం కొత్త జీవోను ఆమోదించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞత తెలిపారు. దేవర రిలీజ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు, తెలుగు సినిమాకు మద్దతు కొనసాగిస్తున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు కూడా థ్యాంక్స్ చెబుతున్నామని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దేవర సినిమా కోసం అదనపు షోలకు, తొలి రోజైన సెప్టెంబర్ 27న ఆరు షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు ఎన్టీఆర్ మరియు దేవర మేకర్స్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
సెప్టెంబర్ 21న దేవర సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో దేవర సినిమాకు సంబంధించిన ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు మూవీ టీమ్‌కు ఏపీ సర్కార్ ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్లలో బాల్కనీ టికెట్‌పై అదనంగా రూ.110.. లోయర్ క్లాస్ టికెట్‌పై రూ.60 అధికం చేసేందుకు అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజ్ రోజైన సెప్టెంబరు 27 నుండి 9 రోజుల పాటు అంటే.. అక్టోబరు 5వరకు ప్రతిరోజు 5 స్పెషల్ షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. కేవలం 27 తేదీన ఒక్క రోజు మాత్రమే 6 షోలు ప్రదర్శించుకునేలా ఉత్త్వరులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో ఆ రోజున అర్ధరాత్రి 12 గంటలకే తొలి షో పడింది.
రెండో రోజు నుంచి మరో తొమ్మిది రోజులు ప్రతీ రోజు 5 షోలు ప్రదర్శించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. దాంతోపాటు రెండు వారాల వరకు టికెట్లపై అదనపు ధరలు ఉంచుకోవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
తెలుగులో ఏదైనా సినిమా మంచి హిట్ అయితే.. సినిమా సెలబ్రిటీలు ట్వీట్ లు వేయడం పరిపాటి. బన్నీ లాంటి వాళ్లు అయితే ఏకంగా యూనిట్ కు పార్టీలు కూడా ఇచ్చిన సందర్భాలు వున్నాయి. కానీ దేవర సినిమా వరకు వచ్చేసరికి ఎవరూ అలాంటి అసక్తి కనబర్చలేదు.. ఎవ్వరూ ట్వీట్ వేయలేదు. పైగా సినిమా ప్రీ రిలీజ్ మీట్ అనుకోకుండా అర్థాంతరంగా అగిపోయింది. ప్రీ రిలీజ్ మీట్ ఆగిపోయింది కదా .. సక్సెస్ మీట్ అయినా అంధ్రలో జరుపుదాం అనుకుంటే అనుమతి రాలేదు. దసరా ఉత్సవాల కారణంతో అనుమతి ఇవ్వలేదు. నిజానికి సినిమా విడుదలకు ముందు ఏపీలో రేట్లు రావు అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు.. రేట్లు వచ్చాయి, అదనపు అటలు వచ్చాయి. దీంతో దేవర సూపర్ హిట్ కాగలిగింది.