బాష బేదాలు లేని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలో మళ్ళీ రీజనల్ ఇండస్ట్రిల పోరు మొదలయ్యిందా ? మా భాష గోప్పంటే, మా బాష గొప్ప అంటూ స్టార్ హీరోలు దెబ్బలాడుకోవడం కాకరేపోతోందా ?నిన్న మొన్నటి వరకు సర్దుమణిగినట్లే కనిపించిన సౌత్ , నార్త్ ఇష్యూలో మళ్ళీ అగ్గిరాజేసింది ఎవరు ?
వాయిస్ : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలో భాష బేదాలు లేవు. సౌత్ సినిమాలు నార్త్ లో, నార్త్ మూవీస్ సౌత్ లో రీజనల్ లాంగ్వేజస్ లో డబ్ చేయబడి రిలీజ్ అవుతున్నాయి. అందులో చాలా చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ గా బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులు కూడా సొంత చేసుకుంటున్నాయి. దీంతో భారత్ లో నిర్మాణమయ్యే చిత్రాలు అన్నీ ఇండియన్ సినిమాలే అనే పరిస్థితికి చేరుకుంది. ఇదే విషయాన్ని చాలామంది స్టార్ హీరోలు అనేకమార్లు చెప్పారు. అలాంటి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలో ప్రస్తుతం సౌత్ వర్సెస్ నార్త్ గా యుద్ధం మొదలయ్యి, రోజురోజుకీ తారా స్థాయికి చేరుతోంది. సినిమాల మధ్య అడ్డంకులు తొలగిపోతున్నా, యాక్టర్ లు, ప్రేక్షకుల మధ్య విభజన గోడలు ఏర్పడుతున్నట్లే కనిపిస్తున్నాయి.
సుదీప్, అజయ్ దేవగన్ లతో మొదలైన ఈ వివాదం ప్రస్తుతం కమల్ హాసన్, మహేష్ బాబు ల వరకు చేరింది. హిందీని గౌరవిస్తాం కానీ, మా భాషను తక్కువ చేస్తే చూస్తూ ఊరుకోం అంటూ ఎవరికి వారు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు.హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదని సుదీప్ ఒకమాట అనగానే అజయ్ దేవగన్ రంగంలోకి దిగిపోయాడు. ఈ క్రమంలోనే రన్ వే 34 విడుదల సమయంలో నేషనల్ లాంగ్వేజ్ అనే మాటపై అజయ్ ఘాటుగా స్పందించారు.అధికారిక భాషలు మాత్రమే ఉన్న భారత దేశంలో హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని ట్వీట్స్ చేశారు. ఇలా మొదలైన ఈ రీజనల్ లాంగ్వేజస్ ఫైట్ అప్పట్లో రచ్చ చేసిందనే చెప్పచ్చు.ఇక ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ నెటిజన్లు స్పందిస్తుండడంతో సుదీప్, అజయ్ లు ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యారట. దీంతో ఈ వివాదానికి ఇక తెర పడినట్లే అని అంతా భావించారు.
అయితే తాజాగా కమల్ హాసన్, మహేష్ బాబులు చేసిన వ్యాఖ్యలతో ఈ గొడవ మళ్ళీ మొదటికి వచ్చినట్లు అయ్యిందట. విక్రమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. సినిమా, రాజకీయం రెండూ కవల పిల్లలు అని, తాను ఇప్పుడు అదే చేస్తున్నా.. తమిళం వర్ధిల్లాలి అని చెప్పడం నా బాధ్యత అని చెప్పిన కమల్ అక్కడితో ఆగకుండా, హిందీ భాషను వ్యతిరేకించక తప్పదని అన్నారు.తనకు ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే దీనికి రాజకీయానికి సంబంధం లేదని చెప్పుకొచ్చారు కమల్. అదే సమయంలో హిందీ నేర్చుకోండి, మాట్లాడండీ కానీ మాతృ భాషను మాత్రం మరవకండి అని చెప్పారు. ఇప్పుడు ఇవే మాటలు సంచలనంగా మారాయి.
మరోవైపు మేజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈవెంట్ లో మాట్లాడిన మహేష్ తెలుగులో తనకు బోలెడంత స్టార్ డమ్ ఇచ్చిన ఫాన్స్ ను ఎంటర్టైన్ చేయడం తన కర్తవ్యం అని, తెలుగు సినిమాలు ఇతర భాషల్లో రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పిన మహేష్.. బాలీవుడ్ లో ఎంట్రీ అనే ప్రశ్నకు స్పందిస్తూ బాలేవుడ్ నన్ను ఎఫ్ఫోర్డ్ చేయలేదు అంటూ సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఇవే మాటలు హిందీనాట వివాదం సృష్టించాయట.అంతేకాదు సూపర్ స్టార్ బాలీవుడ్ ని తక్కువ చేసి మాట్లాడాడు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కాగా, ఈ వివాదం ముదురుతోందని గుర్తించిన మహేష్ తాను హిందీ పరిశ్రమని అగౌరవ పరచలేదని క్లారిఫికేషన్ ఇచ్చాడు.
మొత్తానికి సర్దుమణిగింది అనుకున్న రీజనల్ లాంగ్వేజస్ వివాదం మళ్ళీ మొదలయ్యి సెగలు పుట్టిస్తున్నట్లే కనిపిస్తోంది. మరి ఈ వివాదానికి తెరపడుతుందా, లేక చిలికి చిలికి గాలివానగా మారుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.