ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల బుధవారం తన పుట్టిన రోజు జరుపుకున్నారు. రాజకీయ ప్రముఖులంతా షర్మిలకు సోషల్‌మీడియాలో విషెస్ చెప్పారు. ప్రత్యర్థి పార్టీల నేతలైనా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ట్వీట్ చేశారు. కానీ సొంత చెల్లెలికి కర్టసీ కోసం కూడా వైసీపీ అధినేత జగన్ విషెస్ చెప్పలేదు. దీన్ని బట్టి జగన్‌కు ఇప్పుడు రాజకీయాల్లో శత్రువులెవరైనా ఉన్నారంటే అది షర్మిల మాత్రమేనని అర్థం చేసుకోవచ్చు. చెల్లిని మోసం చేసి, ఆమెనే తన శత్రువుగా మార్చుకున్న ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది..
జగనన్న వదిలి బాణంగా రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల..అన్న కోసం రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. తర్వాత రాజకీయంగా జరిగిన పరిణామాలు, జగన్ వైఖరితో ఆమె వైసీపీకి దూరమయ్యారు. తర్వాత తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించారు. ఐతే ఊహించని రీతిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. విస్తృత ప్రచారం చేశారు. జగన్ ప్రజా వ్యతిరేకవిధానాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. జగన్ ఓటమికి తను ఓ కారణంగా నిలిచారు.
ఇక ఇప్పుడు జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదాలు కూడా నడుస్తున్నాయి. ప్రధానంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాటాల బదిలీ అంశంపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. షర్మిల పలు సార్లు తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు ప్రస్తావించారు. తనకు జగన్ తీరని అన్యాయం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. సందర్భం వచ్చినప్పడల్లా జగన్ వైఖరిని షర్మిల ఎండగడుతూనే ఉన్నారు. ఇప్పుడు జగన్, షర్మిల మధ్య దూరం పెరిగిపోయింది. కేవలం షర్మిలనే కాదు తల్లి విజయమ్మను సైతం దూరం చేసుకున్నారు జగన్.
ఇక తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలకు థాంక్యూ చెప్పారు షర్మిల. ప్రధానంగా చంద్రబాబునాయుడు ట్వీట్‌కు థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారు. సొంత అన్న జగన్ మాత్రం షర్మిలకు విషెస్ చెప్తూ ట్వీట్ చేయకపోవడం చర్చకు దారి తీసింది. అందుకే, జగన్ నీకు ఓ చెల్లి ఉంది.. ఆవిడు గుర్తుందా.?? లేక గుర్తు రాదా..?? అని సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు..











