ఇండస్ట్రీలో పది కాలాలు ఉండాలంటే సక్సెస్సే ప్రాధ్యానం, వరుస హిట్లు వచ్చి ఒక్క ఫ్లాప్ వచ్చినా కెరీర్ ఎండ్ అయిపోతుందనే ప్రచారం మొదలైపోతుంది. అందుకే నేటి తరం కుర్ర హీరోలు చాలా ఎలెర్ట్ గా ఉంటున్నారు, కావాల్సి వస్తే గ్యాప్ తీసుకుంటున్నారు కానీ సినిమాలు మీద సినిమాలు చేయాలనే ఉత్సాహంలో రాంగ్ కథలు ఎంచుకొని తిప్పలు పడటం లేదు.
ఇక ఈ యంగ్ హీరోల బ్యాచ్ లో అటు ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు లేడీ ఫాలోయింగ్ బాగానే ఉన్న హీరో నాగశౌర్య, మనోడికి మెయిన్ ఎస్సెట్ లవర్ బాయ్ ఇమేజ్, అమ్మాయిల దగ్గర నుంచి ఆంటీల వరకు నాగ శౌర్య కు ఉన్న మెజారిటీ ఆడియెన్స్ తనను ప్రేమకథల్లోనే చూడాలనుకుంటూ ఉంటారు. అయితే మనోడకి కమర్షీయల్ హీరో అవ్వాలనే కొరిక ఉంది. దీంతో ఫ్యామిలీ సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో అలా అలా కమర్షీయల్ సినిమాలు చేస్తుంటాడు.
కానీ శౌర్య తో కమర్షీయల్ యాంగిల్ లో సినిమాలు తియ్యాడానికి నిర్మాతలు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో తానే సొంతగా ఓ బ్యానర్ పెట్టి ఇప్పటివరకు మూడు కమర్షీయల్ సినిమాలు తీశాడు. ఇందులో ఛలో సినిమా పెద్ద హిట్ కొట్టి శౌర్యని మళ్లీ జనాలకి దగ్గర చేసింది. అయితే ఆ తరువాత చేసిన నర్తనశాల, అశ్వత్థామ చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, ఐరా క్రియేషన్స్ బ్యానర్ ను నష్టాల్లోకి నెట్టేశాయి.
అయితే అశ్వథామ తరువాత చాలా మంది శౌర్య శ్రేయోభిలాషులు, సన్నిహితులు ఐరా క్రియేషన్స్ లో ఇక సినిమాలు ఆపేసి, బయట సినిమాలు చేయాల్సిందిగా సూచించారట, అయితే మరి ఏం అనుకున్నాడో ఏమో మళ్లీ శౌర్య సొంతంగా సినిమా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో ఐరా క్రియేషన్స్ నుంచి మరో సినిమా రాబోతుందనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో షికార్లు చేస్తోంది.











