టెక్నాలజీ తో తెలుగు స్టార్ హీరోల అభిమానులు అప్డేట్ అవుతున్నారు. కలెక్షన్స్ రికార్డులు గురించి థియేటర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫాన్స్ మధ్య మొదలైన గొడవలు ఇప్పుడు ట్విట్టర్ వరకు పాకాయి. తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్పని ట్విట్టర్ వేదికగా ఫాన్స్ ఒకర్ని ఒకరు తిట్టుకునే పరిస్థితి నెలకొంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు తాజగా ఆగష్టు 9న జరిగింది, ఈ బర్త్ డే రోజున ట్విట్టర్ లో మహేష్ ఫాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు, అతి తక్కువ సమయంలో అత్యిధిక రీట్వీట్స్ చేసి మహేష్ ఫాన్స్ ట్విట్టర్ వేదికగా ఓ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు.
ఇంత వరకు బాగానే ఉంది ఐతే ఈ రికార్డు ని పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఓ ఛాలెంజ్ గా తీసుకొని మహేష్ బాబు సెట్ చేసిన రికార్డు ను బ్రేక్ చేయడానికి ఆల్రెడీ సన్నాహాలు చేస్తున్నారు. ఇది గమనించిన మహేష్ ఫాన్స్ ఈ రికార్డు పవన్ కళ్యాణ్ కి దక్కకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏమైనా కానీ ఫాన్స్ చేస్తున్న ఈ అనవసరపు హడావుడి వల్ల సదరు హీరోలకి ఉన్న క్రేజ్ కి ఎలాంటి ఉపయోగం లేదు. సోషల్ మీడియా వేదికగా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ హీరోలు సినిమాలకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పెరగవు అలానే తగ్గవు. ఇది గమనించైనా ఫాన్స్ ఈ అతి అభిమానం తగ్గించుకుంటే మంచింది అని సినీ నిపుణులు అభిప్రాయం
కొత్త రూపులో పాత కల్చర్
దశాబ్దాల కిందటి కల్చర్ కొత్తరూపు సంతరించుకుంది. పాత కాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫ్యాన్స్ మధ్య తీవ్రమైన విభేదాలు ఉండేవి. ఆ తర్వాతి తరంలో చిరంజీవి- బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండు వర్గాలు పెద్దస్థాయిలో బాహాబాహీకి దిగి కొట్టుకునే సంఘటనలు కూడా అనేకం జరిగాయి. ఇదంతా దశాబ్దాల కిందట సంగతి. ఇప్పుడు తరం మారింది. యువతరంలో టెక్నాలజీ అనేది ఒక అవిభాజ్యమైన కొత్త ఎలిమెంట్ అయింది. యువతకు కెరీర్ ఓరియెంటేషన్ పెరిగింది. అయినా సరే హీరో ల ఫ్యాన్ గ్రూపులు ఇలా యుద్ధాలకు దిగడం మాత్రం మారలేదు.. కాకపోతే… రోడ్లమీద కొట్టుకునే బదులు సోషల్ మీడియా వేదికలమీద కొట్టుకుంటున్నారంతే.