నారా లోకేశ్… ఏపీలో అధికార పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా, ఆ రాష్ట్ర కేబినెట్ లో కీలక మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. ఓ పార్టీకి కీలక నేతగా, మంత్రిగా లోకేశ్ బిందాస్ గా కాలం వెళ్లదీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే లోకేశ్ మాత్రం ఈ తరహా బిందాస్ లైఫ్ తనకు అక్కర్లేదని చెబుతన్నారు. ప్రజలు ఇచ్చిన గెలుపు తనపై మరింత బాధ్యతను పెంచిందని చెబుతున్న లోకేశ్… నిత్యం ప్రజలతోనే గడిపేలా తన దైనందిన ప్రణాళికలు రచించుకుంటున్నారు.
ప్రజల్లో ఉండటమంటే… ఏదో అలా తనను గెలిపించిన మంగళగిరిలోనో, లేదంటే రాష్ట్రంలోని ఇంకే ప్రాంతంలో ఏదో ఒక కార్యక్రమంలో పాలుపంచుకుంటే సరిపోతుందిలే అన్నట్టుగా కాదు. బయట ఉన్నా, ఇంటిలో ఉన్నా…ప్రజల సమస్యల పరిష్కారమే తనకు పరమావధిగా అన్నట్లుగా లోకేశ్ వ్యవహరిస్తున్నారు. ఆపదలో ఉన్నాం… అదుకోండి అంటూ సోషల్ మీడియాలో వచ్చే విన్నపాలకు ఇట్టే స్పందిస్తూ క్షణాల్లో వారికి తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. అంతటితో ఆగకుండా తన బృందానికి అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఆపదలో ఉన్న వారికి సకాలంలో సాయం అందేలా చేస్తున్నారు.
ఆసుపత్రిలో ఉన్నామని, చికిత్సకు అవసరమైన సొమ్ము తమ వద్ద లేదని, మీరే మమ్మల్ని గట్టెక్కించాలని కోరుతూ లోకేశ్ కు రోజు చాలానే విన్నపాలు వస్తున్నాయి. వీటిపై లోకేశ్ కూడా చాలా వేగంగా స్పందిస్తున్నారు. అధైర్యం వద్దు తాను ఉన్నానంటూ లోకేశ్ బాధితులకు హామీ ఇస్తున్నారు. తమ ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకుంటుందని కూడా లోకేశ్ భరోసా ఇస్తున్నారు. లోకేశ్ లో కనిపిస్తున్న ఈ ఉదాత్త వ్యక్తిత్వానికి ముగ్ధలవుతున్న జనం… తమ పాలిట లోకేశ్ నిజంగానే ఆపద్బాంధవుడేనని చెప్పుకుంటున్నారు. కొందరైతే… ఆపదలో ఉన్నారా?… ఏం బాధ పడకండి… మనకు లోకేశ్ అన్న ఉన్నాడంటూ బాధితుల కుటుంబాల్లో భరోసా నింపే యత్నం చేస్తున్నారు.