ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు :
- దేశప్రజలందరూ పండగలను జరుపుకునేప్పుడు జాగ్రత్తగా ఉండండి..
- జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. మనమందరం కలిసి మెలసి దేశాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకుందాం.
- మిత్రులారా వేక్సిన్ వచ్చేవరకు కరోనానుంచి విముక్తి వచ్చినట్టు కాదు. నిర్లక్ష్యం వహించడం తగదు. మానవాళిని రక్షించుకోవడానికి యుద్ధరంగంలో ఉన్నట్లుగానే భావిస్తుండాలి.
- మీ కుటుంబాలను, మీ కుటుంబాల్లోని పిల్లల్ని, ఇళ్లలోని వృద్ధుల్ని మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి. మాస్కు లేకుండా తిరిగితే మీ కుటుంబాలను ప్రమాదం పెట్టినట్టే.
- దేశంలో 90 లక్షలకు పైగా కరోనా బెడ్స్ ఉన్నాయి. కేసులు తగ్గాయి గనుక.. కరోనా వెళ్లిపోయినట్టు భావించొద్దు.
- ఇది పండుగల కాలం. ప్రజలు గుమికూడి పండుగలు చేసుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- కరోనా పై పోరాటం సుదీర్ఘమైనది. దేశప్రజలను కాపాడుకోవడంలో ఇతరదేశాల కంటె మనం ముందున్నాం.. మనదేశంలో రికవరీ రేటు చాలా ఎక్కువ.
- అమెరికా, బ్రెజిల్ దేశాల్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి. మనదేశంలో మాత్రం కేసులు తగ్గుతున్నాయి
- ఇళ్లనుంచి ఇప్పుడిప్పుడే మనం బయటకు వస్తున్నాం.. దేశం కరోనా దెబ్బనుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
- తమ కుటుంబపోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటినుంచి బయటకు వస్తున్న వారు.. జాగ్రత్తలు తీసుకోవాలి.











