సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం ఇండస్ట్రిలో కాక రేపుతున్న సంగతి తెలిసిందే. కాగా, నరేష్ , పవిత్ర చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారని.. వీరిరువురు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంటూ చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ ఇద్దరూ తాము రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అధికారికంగా అంగీకరించడం లేదు. అలాగే ఖండించడం కూడా లేదు. బెస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రమే చెబుతున్నారు.దీంతో వీరి వ్యవహారం మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వీరిద్దరిని మైసూర్ లోని ఓ హోటల్ లో ఎక్స్ పోజ్ చేయడంతో ఈ ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది. ఈ క్రమంలోనే నరేష్, రమ్య ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు. నరేష్ వుమెనైజర్ అంటూ రమ్య మీడియా ముందు తీవ్రంగా ఆరోపిస్తుండగా.. రమ్యనే పెద్ద చీటర్ అని.. తన సెలబ్రిటీ ఇమేజ్ ని వాడుకుని రామయ్య చేసిన అప్పులు, మోసాల వల్ల తాను ఇబ్బంది పడ్డానని నరేష్ ఆరోపించారు.
మరోవైపు పవిత్ర లోకేష్ కూడా రమ్య పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె అనవసరంగా తన పరువుకి భంగం కలిగించేలా బెంగుళూరుకి వచ్చి ఆరోపణలు చేస్తోంది అని వాపోయారు.తనకు , నరేష్ కి మధ్య రమ్య చెబుతున్నట్లు ఎటువంటి సంబంధం లేదని అందరూ తమను సపోర్ట్ చేయాలని కోరారు.కాగా, నరేష్ , పవిత్ర మైసూర్ లోని హోటల్ లో ప్రత్యక్షమవడంతో పవిత్రపై ఒక్కసారిగా పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి.
ఈ వ్యవహారం ఇలా సాగుతుండగా తాజాగా పవిత్రలోకేష కి ఊహించని షాక్ తగిలిందట.నరేష్ తో జరుగుతున్న వ్యవహారం వల్ల ఆమె ఇండస్ట్రిలో అవకాశాలు కోల్పోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వివాదం కారణంగా మూవీ మేకర్స్ పవిత్రను పక్కన పెడుతున్నారని, ఇటీవల రెండు పెద్ద ప్రోజెక్ట్స్ నుంచి ఆమెను తొలగించారనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
వాస్తవానికి పవిత్ర లోకేష్ టాలీవుడ్ లో తల్లి పాత్రలకు బాగా ఫేమస్. దువ్వాడ జగన్నాధం, జై లవకుశ, సర్కారు వారి పాట వంటి ఎన్నో చిత్రాల్లో తల్లి పాత్రల్లో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది.కాగా , ప్రస్తుతం ఆమె పై వస్తున్న విమర్శల నేపధ్యంలో ఆమె తల్లి పత్రాలు చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ భావిస్తున్నారని, అందుకే ఆమెకు ఆఫర్స్ తగ్గిపోతున్నాయని టాక్.