సైకో నేపథ్యంలో సాగె సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తాజాగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. అనిల్, జాస్మిన్ హీరోహీరోయిన్లు. గోపాల్ రెడ్డి కాచిడిని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీ శ్రీ శ్రీ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై టిఎమ్ఎస్ ఆచార్య నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. సంస్థ కార్యాలయంలో హీరో హీరోయిన్లపై తీసిన తొలి సన్నివేశానికి నిర్మాత, సంతోషం సినీ వారపత్రిక పబ్లిషర్ సురేష్ కొండేటి క్లాప్ నివ్వగా,.ఆధ్యాత్మిక వేత్త హరి ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత టి ఎమ్ ఎస్ ఆచార్య మాట్లాడుతూ, “మా సంస్థలో ఇది మొదటి సినిమా, ఆసక్తికర కథతో దర్శకుడు దీనిని మలచబోతున్నారు. మమ్మల్ని ఆదరిస్తారని విశ్వసిస్తున్నాం“ అని అన్నారు. దర్శకుడు గోపాల్ రెడ్డి కాచిడి మాట్లాడుతూ, “ఈ నెల 30 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం. నిర్విరామంగా చిత్రీకరణ జరుపుతాం. సైకో సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో .ఆసక్తికరమైన మలుపులతో సాగుతూ కొత్త అనుభూతిని కలిగించేలా ఈ చిత్రాన్ని మలచబోతున్నాం. అనిల్ ని హీరోగా పరిచయం చేస్తున్నాం. జాస్మిన్ కి ఇది రెండో సినిమా, మోడల్ గా కూడా కొనసాగుతున్న జాస్మిన్ కెరీర్ ను ఈ సినిమా మలుపు తిప్పుతుంది” అని అన్నారు. హీరో అనిల్ మాట్లాడుతూ, “ఇది సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ కథ. చాలా ఆసక్తికరంగా సాగుతుంది అని అన్నారు.
హీరోయిన్ జాస్మిన్ మాట్లాడుతూ, మోడల్ గా ఉంటూ సినిమాల్లోకివచ్చాను. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు” అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే పటేల్ నండుర్క, సంగీతాన్ని గౌర హరి, సినెమాటోగ్రఫీని సీతా రామాంజనేయులు ఉప్పతల అందిస్తున్నారు.
Must Read ;- అనేక ట్విస్టులతో ప్రత్యర్థి సినిమా











