గ్రిప్పింగ్ స్క్రీ ప్లే , ఇంట్రెస్టింగ్ సీన్స్ .. అడుగడుగునా ఉత్కంఠత.. థ్రిల్లర్ మూవీకి ఉండాల్సిన లక్షణాలు. ఇలాంటి సినిమాలకు కథే హీరో. అయినప్పటికీ ఆ తరహా కథాంశాల్లో మంచి క్రేజీ హీరో ఎవరైనా నటిస్తే.. మరింత మైలేజ్ వస్తుంది. హారర్, క్రైమ్ ,సస్పెన్స్ ఏమైనా కానీండి… ఈ జెనరేషన్ ఆడియన్స్ కు ఈ జోనర్ లో కొత్తగా ఏమి చెప్పారన్నదే ముఖ్యం. ఇలాంటి సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది కాబట్టి.. ప్రస్తుతం కొందరు టాలీవుడ్ యంగ్ హీరోలు .. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
ముందు గా లిస్ట్ లో ఉన్న యంగ్ హీరో మంచు విష్ణు. కొంతకాలంగా ఈ హీరో.. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం విష్ణు ఒకే ఒక సినిమా మీద మంచి హోప్స్ పెట్టుకున్నాడు. ఆ సినిమా ‘మోసగాళ్ళు’. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గానూ, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రధాన పాత్రలోనూ నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కు లాక్ డౌన్ బ్రేకులేసింది. త్వరలోనే తిరిగి చిత్రీకరణకు వెళ్లనుంది సినిమా. తెలుగు , ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి హాలీవుడ్ దర్శకుడు జెఫ్ఱీ గీ చిన్ తెరెక్కిస్తున్నాడు.
నిఖిల్ సిద్ధార్ధ… ఎర్లియర్ గా ఈ హీరో ‘అర్జున్ సురవరం’ అనే థ్రిల్లర్ తో ప్రేక్షకుల్ని మెప్పించాడు. గణితన్ తమిళ మూవీకిది రీమేక్ వెర్షన్. ఫేక్ సర్టిఫికెట్స్ స్కామ్ తో రూపొందిన ఈ సినిమా తెలుగులో బాగానే ఆడింది. అందుకే సిద్ధార్ధ .. ఆడియన్స్ ముందుకు మరో థ్రిల్లర్ మూవీతో రానున్నాడు. ఆ సినిమా ‘కార్తికేయ 2’. ఒక దేవాలయం నేపథ్యంలో సాగే.. హారర్ మూవీగా ఇదివరకు ప్రేక్షకుల్ని అలరించిన ‘కార్తికేయ’ సినిమాకిది సీక్వెల్. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు రాబోతోంది. ఎప్పుడో చిత్రీకణకు వెళ్లాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ వల్ల, నిఖిల్ మ్యారేజ్ హడావిడి వల్ల బాగా లేటయింది. వి.యఫ్.ఎక్స్ కు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్న ఈ మూవీని కార్తికేయ స్థాయిలోనే తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ కొత్త సినిమా ఇటీవల అనౌన్స్ అయింది. సూపర్ నేచురల్ పవర్స్ నేపథ్యంలో , జ్యోతిష శాస్త్రాన్ని ప్రధాన వస్తువుగా తీసుకొని మిస్టికల్ థ్రిల్లర్ గా కొత్త దర్శకుడు కార్తిక్ వర్మ దండు ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. సుకుమార్ రైటింగ్స్ , శ్రీవెంకటేశ్వరా సినీ చిత్ర సంయుక్త నిర్మాణంలో సినిమా రూపొందనుంది. ఇందులో కూడా ఓ రేంజ్ లో వి.యఫ్.ఎక్స్ ను ఉపయోగించబోతున్నారట.
బాలనటుడిగా సుపరిచితుడైన .. తేజ సజ్జా ..తొలిసారిగా హీరోగా నటిస్తోన్న సినిమా జాంబీ రెడ్డి. అ, కల్కిలాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత వర్మ ఈ సినిమా ను తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. తొలి తెలుగు జాంబీ మూవీ. హారర్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది. సో.. ఇంకా నిర్మాణంలో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీస్ తో ఎంతమంది హీరోలు సక్సెస్ అందుకుంటారో చూడాలి.











