వైసీపీలో ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఉన్న వైసీపీ కేడర్ లో అలజడి మొదలైంది. ఇక అంతర్యుద్ధం ఎందుకు..? దండగా అని భావించి.. ప్రత్యక్షంగానే యుద్ధం మొదలుపెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడేకొద్ది.. అధికార వైసీపీలో అలజడి మొదలైంది. ఎమ్మెల్యేలు అధిష్టానంపై నిరసన బావుట ఎగరవేస్తున్నారు. టికెట్ దక్కపోయినా పర్వలేదు కానీ.., వంచించి నిలువనా మోసం చేసే దగాకోరు పార్టీ వైసీపీ అని సొంత ఎమ్మెల్యేలకే ఒక క్లారిటీ వచ్చింది. ఇక ఇటువంటి దౌర్భాగ్య రాజకీయాలు ఎందుకని.., అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్రతిని పూనుతున్నారు. దీంతో పార్టీలో నెలకొన్న ఆగ్రహావేశాల తాపం.. తాడేపల్లి ప్యాలెస్ లో నాలుగునరేళ్ళు సేద తీరిన సైకో సీఎంకు తాకింది. ఇక నిద్రపట్టని రాత్రులు గడుపుతూ.. రోజులు లెక్కపెట్టుకుంటున్నారన్నది వాస్తవం.
ఓదార్పు యాత్ర.., పాదయాత్ర.., 2019 ఎన్నికల బహిరంగ సభలు నిర్వాహాణ.., పార్టీ ఫండ్.., పార్టీ గెలుపుకు సర్వం అర్పించి.., అమ్మి కట్టిన కోటాను కోట్ల డబ్బు వంటివి నేడు ఒక రాజకీయ అసమర్ధుడిని నమ్మి బూడిదల పోసిన పన్నీరు మాదిరిగా మారిందని వైసీపీ ఎమ్మెల్యేలు బోరున ఏడుస్తున్నారు. మోసగాడి చేతులు వంచనకు గురైయ్యామని ఎమ్మెల్యేలు.., ద్వితీయ శ్రేణి ప్రజాప్రతినిధులు తత్వం బోధపడి.. తలలు పట్టుకుంటున్నారు. మొన్నటి వరకు చంద్రబాబు, లోకేష్ లపై కారాలుమీరాలు నూరిన ఎమ్మెల్యేలు.. ఏ మోహం పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి దగ్గరవ్వాలో అర్ధంకాక నేడు మదనపడుతున్నారు.
ఈ నేపధ్యంలో ముందుగా అసలు వైసీపీలో అసమ్మతి రాగం సింహపురి నుంచే మొదలైందని చెప్పాలి. సింహపురి సింహాలు జగన్ అకృత్యాలపై గర్జించారు. ఆనం, కోటంరెడ్డి, మేకపాటి లు జగన్ సైకోయిజాన్ని అసహ్యించుకుని బయటకొచ్చారు. మంత్రి వర్గ విస్తీరణ తరువాత జగన్ నిజస్వరూపం ఎమ్మెల్కేలకు పూర్తిగా అర్ధమైంది. ఆనాటి నుంచి వైసీపీ కేడర్ లో బీటలు మొదలయ్యాయి. ప్రకాశం జిల్లా నుంచి ఎంపీ మాగుంట, మాజీ మంత్రి బాలినేని, గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు పార్టీ నిర్ణయాలను, వైవీ పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గుంటూరు జిల్లా ఇప్పటికే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీ కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రులు మోపిదేవి, మేకతోటి సుచరిత, ప్రస్తుత మంత్రి మేరుగ నాగార్జున లు జగన్ పై గుర్రుగా ఉండగా.., మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
అదే బాటలో అన్నీ జిల్లాలోని 50 శాతం పైగా ఎమ్మెల్యేలు.., కేడర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు నిదర్శనమే.. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం, గుంటూరు జిల్లాల నుంచి వైసీపీ ముఖ్య నేతలు ఆ పార్టీని వీడి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడమే. తాజాగా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే చంటిబాబు కూడా వైసీపీ వీడేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారని వార్తలు వినవస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు టికెట్ లేదని జగన్ చెప్పడంతో ఆ పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టీడీపీ నాయకులతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఇలా మొత్తంగా అధికార వైసీపీని వీడేందుకు సీనియర్ నేతలంతా క్యూ కట్టడంతో వైసీపీలో ప్రత్యక్ష యుద్దం షురూ అయినట్లు తేటతెల్లమవుతోంది.