తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దార్శినికతను యావత్తు దేశం ఫాలో అవుతోంది. తత్వం బోధపడిన జగన్.. బాబు స్టైల్ ను ఫాలో అవుతున్నారు.
ఏపీలో చంద్రబాబు తీసుకురాబోతున్న భవిష్యత్తుకు గ్యారెంటీ.. బాబు ష్యూరిటీ.. సూపర్ సిక్స్ పథకాలు నేడు ప్రజల్లో అత్యంత ఆధారణ పొందుతోంది. ఇదే అంశం వైసీపీలో కలవరానికి గురి చేస్తోంది. ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తే.. ఇక సంక్షేమం వరదాల పారడం గ్యారెంటీ అని నమ్మి.. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చారు. వీటిని పోయిన ఏడాది నుంచే తెలుగుదేశం కేడర్ విస్తృతంగా ప్రచారం చేస్తూ.. ప్రజల్లోకి బలంగా తీసుకుపోతోంది.
ప్రభుత్వం నచ్చిన పథకాలు కాదు.. ప్రజలకు ఏం కావాలి..? వారు మెచ్చే సంక్షేమం ఏంటీ అన్నది దానిపై కసరత్తు చేసి.. తయారు చేసిందే ఈ భవిష్యత్తుకు గ్యారెంటీ.., బాబు ష్యూరిటీ సూపర్ సిక్స్ పథకాలు. మహిళల కోసం మహాశక్తి పథకం.., యువత ఉద్యోగ, ఉపాధి కోసం యువగళం, రైతును అన్నీవిధాలుగా ఆదుకునేందుకు అన్నదాత, ప్రజలకు స్వచ్ఛ జలాలు అందించేందుకు ఇంటింటికీ తాగునీరు, బీసీల కోసం రక్షణ చట్టం, ప్రజల ఆర్ధిక ఇబ్బందులు తొలిగేలా పూర్ టూ రిచ్ వంటి ఆరు గ్యారెంటీ పథకాలను తెలుగుదేశం ప్రవేశపెట్టింది. అధికారంలోకి రాగానే ఈ పథకాలన్నీ అమలులోకి వస్తాయన్నది చంద్రబాబు ఇస్తున్న ష్యూరిటీ. దీంతో ఏపీ సర్వతోముఖంగా అన్నీవర్గాలకు సంక్షేమం అందించవచ్చున్నది చంద్రబాబు లక్ష్యం.
అయితే ఈ నేపథ్యంలో 2019లో జగన్ తీసుకొచ్చిన నవ రత్నాలు గుళకరాళ్లని తేలిపోయింది. ప్రజలు కూడా వీటిని చెత్త పథకాలని ఎప్పుడో తెల్చేశారు. దీంతో వాటిని నమ్ముకుంటే ప్రయోజనం లేదని.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీసుకొస్తున్న సూపర్ సిక్స్ పథకాలను కాపీ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు జగన్. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రవేశపపెట్టి విజయం సాధించిన పథకం.. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం. ఇదే అంశాన్ని చంద్రబాబు ఎప్పుడో ఆలోచించి భవిష్యత్తుకు గ్యారెంటీ బాబు ష్యూరిటీ పథకాల్లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం పథకం తీసుకొచ్చేలా ప్రణాళికలు వేసుకుంటుంటే.. ఇదే పథకాన్ని జగన్.. తాను అధికారంలో ఉండగానే వచ్చే జనవరి నుంచి అమలులోకి తీసుకోచ్చేందుకు అడుగులు వేస్తున్నారు.
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతన్నారు. అయితే అన్నీ ఉచితాలంటూ పప్పు బెల్లాలుగా రాష్ట్ర సంపదను ధార పోశారు. రాష్ట్ర ప్రజలను నిలువున దోచుకున్నారు. పెరుగుతున్న ధరలు.., కుంటపడ్డ అభివృద్ధి.., జడలువిప్పిన అవినీతిని చూసి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.., జగన్ పీడ ఎప్పుడు ఇరగడ చేద్దామా అని ఏపీ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తీరా ఎన్నికల ముందు.. మహిళా ఓటర్లును ఆకట్టుకునేలా చంద్రబాబు ఫార్మూలాను ఫాలో అవుతున్నారు జగన్. దీన్ని ప్రజలందరూ గమనిస్తునే ఉన్నారు. ఎన్ని జిమిక్కులు చేసినా.. 2024లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. చివరాఖరికి వచ్చేసరికి అది ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్ ప్రయాణమని చెప్పినా.. ఏపీ ఓటర్లు జగన్ ను నమ్మే పరిస్ధితి లేదన్నది క్లియర్.











