అధికారం కోసం పాదయాత్ర..అధికారం వస్తే పరదాల మాటు యాత్ర ఇది జగన్ అనుసరిస్తున్న స్ట్రాటజీ. 2019 ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజలను తనవైపు తిప్పుకున్నారు జగన్. ముద్దులు పెట్టుకుంటూ, హగ్గులు ఇచ్చుకుంటూ ఐపాక్ డ్రామాను రక్తి కట్టించారు. రావాలి జగన్…కావాలి జగన్, చెప్పాడంటే చేస్తాడంతే, మాట తప్పం మడం తిప్పం…అంటూ చేసిన నినాదాలు ఆ టైంలో జనంలోకి బాగా వెళ్లాయి. కానీ తీరా 2019లో అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది.
………………..
ఇక 2024లో వైసీపీ అధికారానికి దూరం కావడంతో తిరిగి ప్రజలతో మమేకం కావడానికి వ్యూహాలు రచిస్తున్నారు జగన్. ఒక్కో కారణంతో ఒక్కో జిల్లా పర్యటన చేస్తున్నారు. ఓసారి పరామర్శల పేరుతో, మరోసారి రైతుల పేరు చెప్పుకుని, మరోసారి పార్టీ నేతల కోసం జైలు యాత్రలు చేపడుతున్నారు. శవ రాజకీయాలకు సైతం వైసీపీ వెనుకాడడం లేదు. వైసీపీ ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు, జగన్ మళ్ళీ పాత పద్ధతినే నమ్ముకున్నారు.
…………………
రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నికల ముందు మరొకసారి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించారు. మంగళవారం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశమైన జగన్ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ భవిష్యత్ లో చేయబోయే పాదయాత్రలో మిమ్మల్ని అందరిని ప్రత్యక్షంగా కలుస్తానంటూ వైసీపీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఐతే అధికారంలో ఉన్న ఏనాడూ జగన్ కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ అధికారం దూరమయ్యే సరికి మళ్లీ జగన్‌కు కార్యకర్తలు గుర్తొచ్చారు.
……………..
గడిచిన ఐదేళ్లూ విధ్వంస పాలన కొనసాగించారు జగన్. ఏ రంగాన్ని వదల్లేదు. రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు కదా ఉన్న వాటిని తరిమేశారు. జె-టాక్స్ పేరిట పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల్లో రైళ్లు పరిగెత్తించారు. అభివృద్ధి అనే పదాన్నే మరిచిపోయారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులను పట్టించుకోలేదు. మొత్తమ్మీద జగన్ అరాచక రాజకీయం నడిపారు. తిరిగి కూటమి అధికారంలోకి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఐతే జగన్ పొర్లు దండాలు పెట్టిన ప్రస్తుతం నమ్మే స్థితిలో ప్రజలు లేరు.
తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్ గొప్ప మనసు..
టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ రక్షణ...











