లైగర్ కే నెటిజన్ల పంచ్ దెబ్బలు తప్పడం లేదు. బాయ్ కాట్ లైగర్ హ్యాష్ ట్యాగ్ ఓ పక్క ట్రెండ్ అవుతుంటే లైగర్ టీమ్ కూడా ప్రతిస్పందించింది. ఐ సపోర్ట్ లైగర్, అన్ స్టాపబుల్ లైగర్ పేరుతో రెండు హ్యాష్ ట్యాగ్ లో పోటీగా ట్రెండ్ అవుతున్నాయి. లైగర్ బరిలో ఈ ట్రెండింగ్ ఫైట్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. దీని వెనుక ఏ శక్తులు పనిచేస్తున్నాయో తెలియడం లేదు. బాయ్ కాట్ లైగర్ కు ధీటుగా లైగర్ కావాలంటూ అవుతున్న ట్రెండింగ్స్ కే ప్రేక్షకుల సపోర్ట్ లభిస్తోంది. లైగర్ బాయ్ కాట్ అనే దాన్ని ఎందుకు ట్రెండింగ్ చేస్తున్నారు? ఇది కరణ్ జోహార్ ప్రాజెక్ట్ అనా లేక ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలకు వస్తున్న క్రేజ్ చూడలేకా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ఈ లైగర్ సినిమా. అనన్యా పాండే ఇందులో హీరోయిన్. మంచి అంచనాల నడుమ ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
బాలీవుడ్ సినిమాలకూ తప్పలేదు
ఇక బాయ్ కాట్ ట్రెండింగ్ విషయానికి వద్దాం. ఇటీవల ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్, తాప్సీ దొబారా చిత్రాలకు కూడా ఈ బాయ్ కాట్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సినిమాలను బహిష్కరించాలని సోషల్ మీడియాలో ప్రచారం సాగించారు. ఇది సరైన చర్య కాదని బాలీవుడ్ ప్రముఖులు కూడా అన్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ లైగర్ ను కూడా బాయ్ కాట్ చేయాలనే డిమాండు ఊపందుకుంది. దీన్ని అడ్డుకోడానికి విజయ్ దేవరకొండ సోషల్ మీడియా టీమ్ ప్రయత్నిస్తోంది. ఆ హ్యాష్ ట్యాగ్ కు కౌంటర్‌గా విజయ్ అభిమానులు, సినీ ప్రియులు, విజయ్ టీమ్ ఐ సపోర్ట్ లైగర్, అన్ స్టాపబుల్ లైగర్ అనే యాష్ ట్యాగ్ లను ట్రెండింగ్ లోకి తెచ్చారు. పాండమిక్ తర్వాత ఏర్పడిన అంతు పట్టని పరిస్థితి ఇది. ఇది త్వరలోనే సమసిపోతుందని, మళ్లీ బాలీవుడ్ కు మంచి రోజులు వస్తాయని హిందీ నటులు చెబుతున్నారు. వేల మంది ఆధారపడిన అతి పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలువు ఇవ్వడం అర్థం లేని పని అంటున్నారు. లైగర్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
సక్సెస్ విషయంలో ఉత్తరాది సినిమాలు వెనుకబడి ఉన్నాయి. బాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలకు కూడా ధియేటర్లకు జనం రావడం లేదు. దక్షిణాది చిత్రాలు విజయపథంలో దూసుకుపోతున్నాయి. ఇటీవల కార్తికేయ 2 సినిమాకు బాలీవుడ్ లభించిన ఆదరణ చూసి విస్తుపోతున్నారు. లైగర్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఈ సినిమా టీమ్ ను చూడటానికి ఎగబడుతున్నారు. దక్షిణాది సినిమాలపై ఏర్పడిన క్రేజ్ చూసి తట్టుకోలేని కొందరు లైగర్‌ను కూడా టార్గెట్ చేసినట్లు సమాచారం. లైగర్ టీమ్ తాజాగా ఓ ఇంటర్వూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఛార్మి కాస్తా ఎమోషనల్ అవుతూ.. కళ్లనీళ్లు పెట్టకున్నారు. వరుస లాక్డౌన్లు రావడంతో.. ఆర్థికంగా తాము చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పారు.మరో విషయం ఏమిటంటే లైగర్ కు ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని, అంత భారీ ఆఫర్ రిజెక్ట్ చేయడానికి దమ్ము కావాలని, ఆ దమ్మున్న వ్యక్తి పూరియేనని ఆమె అన్నారు. అలాంటి వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో నిరాశకు లోనయ్యారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ తమను ధైర్యంగా ముందుకు నడిపారని అన్నారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారీగా లైగర్ బిజినెస్
ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ఇండియా లైగర్ ఏమోజీని విడుదల చేసింది. ఇలా గతంలో తెలుగులో ప్రభాస్, మహేష్‌ల తర్వాత విజయ్ సినిమాకు ఇలా రావడం పట్ల రౌడీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. లైగర్ కు ఓ రేంజ్లో బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఓవర్సీస్ రైట్స్‌ను సరిగమ సినిమాస్ దక్కించుకుంది. దాదాపుగా 8 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోయాయని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్, కెజీఎఫ్ సినిమాలు కూడా సరిగమ సినిమాస్ ఓవర్సీస్లో డిస్ట్రీబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతోందని తెలుస్తోంది. ఒక్కే తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని సమాచారం. నైజాం ఏరియాకి థియేట్రికల్ రైట్స్ 30 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఓటీటీ రైట్స్‌ను దాదాపు 85 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్ తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు. విజయ్ దేవరకొండ సినిమాల్లో ఇదే పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పక తప్పదు. మొత్తానికి ఈ సోషల్ మీడియా యుద్ధం ఎలా ముగుస్తుందో చూడాలి.











