August 9, 2026 3:52 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

సోము ఉలికిపాటు.. పార్టీకి గ్రహపాటు!

భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కొత్తగా పదవి వచ్చేసరికి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. 

August 23, 2020 at 2:55 PM
in Editorial
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సాధారణంగా రాజకీయ నాయకులు మీడియా మీద ఎంత అక్కసు ఉన్నప్పటికీ.. దాన్ని వెళ్లగక్కే తీరులో కాస్త సంయమనం పాటిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నాటినుంచి ‘ఆ రెండుపత్రికలు’ అని చెప్పుకుంటూ వచ్చినా, చంద్రబాబునాయుడు హయాంలో ‘అవినీతి పుత్రిక’ అంటూ అభివర్ణించినా.. జగన్మోహనరెడ్డి హయాం వచ్చిన తర్వాత.. ఫలానా పత్రికలకు కనీసం ప్రభుత్వ కార్యాలయాలనుంచి ‘విడుదల చేసే’ సమాచారం తప్ప, ‘అడిగే’ సమాచారం ఇవ్వరాదని అప్రకటిత హుకుం జారీ అయినా.. ప్రెస్ మీట్లలో వెటకారాలు పేలుతూనే ఉన్నా.. అన్నీ నర్మగర్భంగానే సాగిపోతుంటాయి. అయితే సోము వీర్రాజు కొత్త సారథి. ఇన్నాళ్లూ ఏదో తోచినప్పుడు.. నోటికి వచ్చిందల్లా తిట్టేయడమే తప్ప.. బాధ్యతతో మాట్లాడవలసిన అవసరం రాలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ రూపేణా బాధ్యత తనకు వచ్చినప్పుడు అలకపూనినట్లుగా.. ఎక్కువకాలం మౌనమే పాటించారు. ఇప్పుడు కోరుకున్న రాష్ట్రాధ్యక్ష పదవి వరించింది. అయితే.. అదుపులేని అదే తరహా మాట తీరు  సాగుతోంది. 

జాతీయ పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు గనుక.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గనుక.. భాజపాకు రాష్ట్రంలో ఉన్నది ఒక్క శాతం ఓటు బ్యాంకు మాత్రమే అయినా.. ప్రజల దృష్టిలో విలువ లేకపోయినా.. మీడియా కాస్త పట్టించుకుంటుంది. అందుకే సోము వీర్రాజును కూడా అందరూ ఇంటర్వ్యూలు చేయడమూ జరిగింది. తొలి ఎటెంప్ట్ లోనే ఆయన టీవీ9 రజనీకాంత్ తో దాదాపు గొడవ పడ్డట్టుగా మాట్లాడేశారు. చివరికి ‘మీ పదవికి తగ్గ హుందాతనం అలవాటు చేసుకోండి’ అనే తరహాలో నీతులు చెప్పించుకున్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏకంగా బస్తీ మే సవాల్ అనేస్తున్నారు. 

రాధాకృష్ణ ఈ ఆదివారం కొత్తపలుకు వ్యాసం రాశారు. రాజకీయాలను తన శైలిలో విశ్లేషిస్తూ జీవీఎల్ ప్రస్తావన కూడా తెచ్చారు. ‘మీ జీవీఎల్ మీ ఇష్టం’ అనేది ఆ ప్రస్తావనకు ఉపశీర్షిక. జీవీఎల్ వ్యవహార సరళి ప్రతిసారీ వివాదాస్పదంగానే ఉంటుంది. 

ప్రజల్లోంచి గెలవగలిగిన నాయకుడు కాదు గనుక… ప్రజల్లోంచి గెలిచే ఆలోచన ఆయనకు కూడా లేదు గనుక.. పార్టీ భావజాలానికి భజన చేస్తూ ఉంటే చాలు.. పార్టీ బాగున్నంత కాలం తనను చల్లగా చూసుకుంటూ ఉంటుందనేది ఆయన భావన. అందుకే… ఆయన ఎప్పుడూ తన మాటల్లో తర్కం పట్టించుకోరు. ఇటీవలి కాలంలో ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి కించిత్ ఇబ్బంది వచ్చినా.. తక్షణం మీడియా ముందుకు వచ్చి.. తనదైన విశ్లేషణలు అందిస్తున్నారు. (ఎదురింటి పాట పాడుతున్న బీజేపీ చిలకలు)

సుజనా తెలుగుదేశానికి మేలు చేస్తున్నట్టే, ఈ జాతీయ పార్టీనుంచి జీవీఎల్ వైకాపాకు కొమ్ము కాస్తున్నారు. ఈ జీవీఎల్ ధోరణిని ఆర్కే ఎత్తి చూపుతూ ‘మీ జీవీఎల్ మీ ఇష్టం’  అనే వ్యాసం రాశారు. దాంతో సోము వీర్రాజు గారికి కోపం తన్నుకొచ్చింది. ఆర్కే (రాధాకృష్ణ) బహిరంగంగా రాశారు గనుక.. తను కూడా ఒక బహిరంగలేఖ రాసేశారు. ఇంకా నయం.. ఆంధ్రజ్యోతికి దీటుగా కమలజ్యోతి అనే పత్రిక పెట్టదలచుకోలేదు!!

‘మీ సంపాదకీయం చదివాను’ అంటూ తన దండయాత్ర ప్రారంభించారు. నిజానికి అది సంపాదకీయం కాదు- వ్యాసం మాత్రమే. తన పత్రికలో కాలమిస్టుగా  రాస్తున్నారు. పైగా రాధాకృష్ణను ‘సంపాదకులు’గా సంబోధించారు. ఆ పత్రికకు ఆయన మేనేజింగ్ డైరక్టర్ మాత్రమే. సంపాదకులు- కె.శ్రీనివాస్. ఇలా బేసిక్ నాలెడ్జి లేకుండ ఆయన లేఖను ప్రారంభించారు. 

(ఆర్కే రాసిన కొత్తపలుకు వ్యాసంలో జీవీఎల్ గురించిన భాగం ఇక్కడ చదవండి)

లేఖ దిగువన సంతకం ఉన్నంత మాత్రాన ఆ లేఖను అచ్చంగా సోము వీర్రాజు రాశారని అనుకోడానికి వీల్లేదు. చిటికెవేస్తే రాసిపెట్టడానికి పార్టీ బృంద సభ్యులు బోలెడంత మంది ఉంటారు. అలాంటి వారిలోనైనా కాస్త పరిజ్ఞానం ఉన్నవారిని సోము వీర్రాజు ఎంచుకుని ఉండాల్సింది. ఆ పనిచేయలేదు. ఆ పాటి జ్ఞానం ప్రకారమే లేఖ మొత్తం సాగింది. రాసిన వారి జ్ఞానం ఎలాంటిదైనా, లోపాలున్నప్పుడు పోయేది తన పరువు గనుక.. సంతకం పెట్టేముందు సోము వీర్రాజు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఉండాలి. అది జరగలేదు. 

ఆ లేఖలో రాధాకృష్ణ మీద వెటకారాలు, ఎత్తిపొడుపులు చాలానే ఉన్నాయి.రాధాకృష్ణ తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటారనే సంగతి ప్రత్యేకంగా ఇవాళ సోము వీర్రాజు కనుగొన్న సంగతి కాదు. ఆయన కొత్తగా ప్రజలకు చెప్పవలసిన అవసరం లేదు. దాన్ని చాటడం వలన ఆయన కొత్తగా సాధించేది కూడా లేదు. కానీ జీవీఎల్ వైకాపాకు బాకాగా మారుతున్నాడా లేదా అనేది చెక్ చేసుకోవడం ఆయన బాధ్యత. ఎందుకంటే ఆయనే పార్టీకి సారథి. పార్టీ మునిగితే అందుకు ఆయనది కూడా బాధ్యతే అవుతుంది. ఆర్కే కు ఇచ్చిన కౌంటర్ చూస్తే.. జీవీఎల్ మీద వ్యాఖ్యలకు ఉడుక్కున్నట్టుగా అనిపించదు.. ఎప్పటినుంచో ఆర్కే మీద ఉన్న కోపాన్ని వెలిబుచ్చడానికి ఈ వ్యాసాన్ని వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. 

జీవీఎల్‌ను చీమకుడితే నొప్పి సోము వీర్రాజుకు కలుగుతున్నట్లుగా ఈ లేఖ ఉంది. జీవీఎల్ తీరుపై ప్రజల్లో బోలెడన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో  ఆయన తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడడం సోము వీర్రాజుకు ఎలాంటి కీర్తిని కట్టబెడుతుందో ఆయన తెలుసుకోవాలి. ‘‘నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి’’ అంటూ వీర్రాజు ఈసడించారు. పార్టీ అనేది పబ్లిక్ అయినప్పుడు.. అందులో అంతర్గత వ్యవహారాలేమిటో అర్థం కావడం లేదు. ఆర్కే రాసింది పార్టీ నాయకుల పడగ్గది వ్యవహారాలు, వంటింటి ముచ్చట్లు కాదు!

‘‘వ్యక్తుల ప్రయివేటు బతుకు 

వారి వారి సొంతం

పబ్లిక్ లోకి వస్తే 

ఏమైనా అంటాం’’

ఇది శ్రీశ్రీ మాట. 

బహుశా ఈ ‘కాషాయ’దళపతికి- మహాకవి రాసిన ‘ఎర్ర’ కవిత్వం తెలియకపోవచ్చు. తెలిసిన ఆయన ఒప్పుకోకపోవచ్చు. కానీ జీవీఎల్ మాటలు మాత్రమే కాదు, సారథిగా ఆయన వ్యవహరించే ఇలాంటి దుడుకు పోకడలు కూడా పార్టీకి చేటు చేస్తాయని తెలుసుకోవాలి. 

(సోము వీర్రాజు రాసిన లేఖ పూర్తిపాఠం ఇక్కడ చదవండి)

Tags: andhrajyothyap bjpeditorialkothapalukuleotoprkSomu Veerrajusuresh pillaivemuri radhakrishna
Previous Post

చాన్నాళ్ల తర్వాత ప్రధానపాత్రలో జేడీ!

Next Post

చిరుకు మోహన్ బాబు గిఫ్ట్ అదిరిపోయిందంతే

Related Posts

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

by లియో డెస్క్
August 9, 2026 8:57 am

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist