మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఓ బైక్ కళాకృతిని ఆయనకు గిఫ్ట్ గా పంపారు మోహన్ బాబు. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ” నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. థ్యాంక్యూ మోహన్ బాబు ” అని ట్వీట్ చేశారు చిరంజీవి.
మోహన్ బాబు కానుక పంపారు. చిరంజీవి దానికి థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. అంతా బాగానే ఉంది. కానీ ‘తొలిసారిగా’ అనడమే తమాషాగా ఉంది.
నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి… … … Thank you @themohanbabu 🤗 pic.twitter.com/8ROLZ6yfwI
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2020