జబర్ధస్థ్ కామెడీ షోతో తెలుగు ప్రజలకి సుపరిచితమైన కమీడియన్ కిరాక్ ఆర్.పి దర్శకునిగా మారారు. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కోవూరు అరుణాచలం నిర్మాతగా కిరాక్ ఆర్.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం 1 సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రను జే.డి చక్రవర్తి పోషిస్తున్నారు. పద్మజ పిక్చర్స్ మూవీ ఆఫీసులో జరిగిన పూజా కార్యక్రమానికి వెండితెర, బుల్లితెర రంగాలకి చెందిన వివిధ ప్రముఖులు విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన వారిలో జే.డి.చక్రవర్తితో పాటు, మెగా బ్రదర్ నాగబాబు, జబర్ధస్థ్ కామెడీ షోకి చెందిన ఆర్టిస్టులు ఉన్నారు.
రవితేజ ద్విపాత్రాభినయంతో ‘ఖిలాడి’
రవితేజ సరసన మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి నాయకలుగా నటిస్తున్నారు. రమేష్ వర్మ...