కడప,చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో ఎర్ర చందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు.అధికార వైసీపీ నేతలే స్వయంగా రెడ్ సాండిల్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.కడప జిల్లా రాయచోటి పరిధిలోని సుండుపల్లె సానిపాయ మెయిన్ రోడ్డు వద్ద పోలీసులు జరిపిన ఆపరేషన్లో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు దొరికిపోయారు.సుండుపల్లె సిద్దారెడ్డి చెరువు వద్ద మరో ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.వీరి వద్ద నుంచి కోటి రూపాయల విలువ చేసే 55 ఎర్రచందనం దుంగలు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో వైసీపీ నేతలు
పోలీసులు అరెస్టు చేసిన ఎర్రచందనం స్మగ్లర్లలో కొందరు వైసీపీ నేతలు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండల వైసీపీ నేత గజ్జల శ్రీనివాసుల రెడ్డి కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు.గతంలోనే ఇతనిపై చిత్తూరులో 8, కడప జిల్లాలో 9 కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు.గజ్జల శ్రీనువాసుల రెడ్డి బార్య గజ్జల శృతి వైసీపీ తరఫున కేవి పల్లి మండల జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇక కడప జిల్లా రామాపురం మండలం బండపల్లెకు చెందిన వైసీపీ నేత సదిపిరాళ్ళ రెడ్డప్పరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఇప్పటికే 10 కేసులున్నాయని జిల్లా ఎస్పీ కెకెఎస్ అన్భురాజన్ తెలిపారు.
Must Read ;- వైసీపీ మంత్రిని ‘జిప్పుబాబా’తో పోల్చిన టీడీపీ నేత!











