టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణ వైసీపీ మంత్రి అనిల్ యాదవ్ ని జిప్పుబాబాతో పోల్చారు. ఆయన సోకాల్డ్ ఇరిగేషన్ మంత్రి అని కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జిప్పుబాబా ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి, ఎప్పుడూ ప్రతిపక్ష నాయకుల గురించే మాట్లాడతారని ఎద్దేవా చేశారు. అసలు ఆయన ఎందుకు మీడియా ముందుకు వస్తాడో ఎవరికీ అర్థం కాదు అని చురకలంటించారు.
చంద్రబాబు 30 ఏళ్ల క్రితమే హైదరాబాద్ లో ఇళ్లు కట్టుకున్నాడని, అప్పుడు మీ జగన్ రెడ్డి చడ్డీలు వేసుకున్నాడని కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డికి తాడేపల్లి తప్ప ఏం గుర్తుకురాదు అన్నారు. రుయా ఘటన జరిగినా.. వైజాగ్ లో ప్రమాదం అమాయకులు ప్రాణాలు కోల్పోయినా.. జగన్ మాత్రం తాడేపల్లి నివాసానికి పరిమితమవుతున్నాడని అన్నారు. చంద్రబాబును విమర్శంచే అర్హత ఏ ఒక్క వైసీపీ నాయకులకు లేదని ఆనం ధ్వజమెత్తారు.
Must Read ;- అధికారంతో చెలరేగుతున్నారు.. నీలి మూక అని ఏకేసిన ఆర్కే










