స్టార్ మాలో బిగ్ బాస్ -4 నడుస్తున్నంత కాలం అభిజీత్ పేరు మార్మోగిపోయింది. అతని గురించి సోషల్ మీడియా అంతా ఒకటే హోరు. బిగ్ బాస్ 4 విజేతగా నిలిచిన అభిజిత్ ప్రస్తుతం సైలెంట్ అయిపోయాడేంటా అన్న సందేహం అందిరిలోనూ కలుగుతోంది. నిజానికి అది సైలెంట్ కాదు మోస్ట్ వయొలెంట్ అనుకోవాల్సిందే. బిగ్ బాస్ లో రన్నర్ గా నిలిచిన అఖిల్, సోహైల్ ఎవరికి వారే సినిమాలు చేసేసుకుంటూ బిజీగా ఉన్నారు. అభిజిత్ లో మాత్రం ఇప్పటిదాకా చడీచప్పుడు లేదు.
బిగ్ బాస్ విజేతగా అభిజిత్ కు ప్రైజ్ మనీలో కోత పడటాన్ని అతని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. అయినా అతను నోరు మెదపకపోవడం చూస్తుంటే అతని వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమైంది. ఎందరో ఫిదా అవడానికి అతని వ్యక్తిత్వమే కారణం అనడంలో అతిశయోక్తిలేదు. తాజా అప్ డేట్ ఏమిటంటే హీరోగా అభిజిత్ బిజీ కాబోతున్నాడు. అక్కినేని నాగార్జునతోనే అభిజిత్ సినిమాల ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ కు అతను మూడు సినిమాలు చేయడానికి సంతకం చేసినట్టు సమాచారం.
అభిజిత్ లో తొందరపడే గుణం లేదు. నిదానమే ప్రధానంగా అడుగులు వేయడం అతనికి మొదటినుంచీ అలవాటే. లేకుంటే ఇప్పటికే ఎన్నో సినిమాలను అంగీకరించి ఉండేవాడు. అభిజిత్ చేయబోయే సినిమాలు కూడా అంత తొందగరా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు లేవు. దానికి కారణం అతనికి తగ్గ కథ దొరక్కపోవడమే. అలాంటి కథలతో ఎవరైనా వస్తే అవకాశం ఇవ్వడానికి నాగార్జున వెనుకాడరు. త్వరలోనే అతని సినిమా ఒకటి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. దర్శకుడు ఎవరన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.
Must Read ;- వెబ్ సిరీస్ గా బిగ్ బాస్ 4 లవ్ స్టోరీ











