అతిలోక సుందరి శ్రీదేవి కూతుళ్ల మధ్య ఉండే అన్యోన్యతే వేరు. ఎవరెక్కడ ఉన్నా పుట్టిన రోజు లాంటి ప్రత్యేక సందర్భాలు వస్తే మాత్రం కలుసుకోవాలసిందే. కలుసుకోలేని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పట్లు కూడా చేసుకుంటారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ తన కెరీర్ కు చక్కటి బాటలు వేసుకుంటోంది. మార్చి 6వ తేదీ ఆమె 24వ పుట్టిన రోజు. ఆమె తన సినిమా షూటింగ్ కోసం పంజాబ్ లో ఉంది. అక్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలతో పాటు ఓ రెండు బహుమతులను కూడా ఖుషీ కపూర్ అందజేసింది.

అదేమిటంటే ఓ ఫొటో, ఓ వీడియో. తమ చిన్నప్పటి మధురస్మృతులతో కూడిన వీడియో అది. ఎంతో సృజనాత్మకంగా దాన్ని రూపొందించింది. తనకు అందిన పుట్టిన రోజు కానుకలను చూసి జాన్వీ మురిసిపోయింది. ఒక్క ఖుషీనే కాదు జాన్వీకి ఈరోజు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇతర స్నేహితులు, బంధువులు, సహోద్యోగుల నుంచి శుభాకాంక్షలు అందాయి. తన సోషల్ మీడియా అకౌంట్ లోని ఫొటోలన్నిటినీ సేకరించి వాటికి మంచి ఎడిటింగ్ నైపుణ్యాన్ని జోడించి చక్కటి వీడియో తయారుచేసింది.
వీడియో మాత్రమే కాకుండా వాటిని అందమైన ఫొటోగానూ మార్చింది. ఒకర్నొకరు పట్టుకోవడం, జాన్వీ చిన్నప్పటి నృత్యం లాంటి అంశాలన్నీ జోడించింది. మొత్తానికి ధడక్ నటికి దడ పుట్టించేలా చెల్లిలు బహుమతులు అందజేసింది. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానంటూ కామెంట్ చేసింది. బాబాయి సంజయ్ కపూర్ కూడా ఓ లవ్ సింబల్ తో తన అభిమానాన్ని చాటుకున్నాడు.
Must Read ;- జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్..











