బిగ్ బాస్ సీజన్ ఫోర్ అట్టహాసంగా ముగిసింది. నాగార్జున అక్కినేని హోస్టింగ్, మెగాస్టార్ చిరంజీవి చేసిన హంగామా వెరసి ఫైనల్ ఎపిసోడ్ అదిరింది అనే చెప్పాలి. ఈ సీజన్ కి అభిజీత్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ లో అభిజీత్ ఒక బలమైన పోటీదారుడనే చెప్పాలి. హౌస్ లో తను నడుచుకున్న తీరుతో కోట్ల అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాంటి అభిజీత్ కు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. సినిమా వర్గాల సమాచారం ప్రకారం అభిజీత్ కు ఇప్పటివరకు రెండు సినిమా ఆఫర్లు అలాగే పన్నెండు వెబ్ సిరీస్ల ఆఫర్లు వచ్చాయని తెలుస్తోంది.
Also Read ;- విజయ్ దేవరకొండకి ఒక థ్యాంక్స్ సరిపోదు బిగ్ బాస్ 4 విజేత అభిజిత్
అవకాశాలు ఇచ్చిన వారిలో టాప్ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారని సమాచారం. అయితే అభిజీత్ ఇప్పటి వరకు ఎవరికి ఓకే చెప్పలేదు. త్వరలోనే వీటిపై ఒక నిర్ణయానికి వస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. తన ఫాన్స్ తో సోషల్ మీడియా ద్వారా ఇంట్రాక్ట్ అవుతున్నాడు అభిజీత్. అలాగే వెబ్ సిరీసులకు సంబంధించిన కథలను కూడా వింటున్నాడు.
తనకు కథ బాగా నచ్చితేనే సినిమాకైనా, వెబ్ సిరీస్ కైనా ఓకే చెప్తానని ఇప్పటికే అభిజీత్ ప్రకటించాడు. మరి ముందుగా తను ఏవిధమైన కథను ఎన్నుకుంటాడో చూడాలి. అభిజీత్, శేఖర్ కముల దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అభిజీత్. అంతేకాకుండా ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. బిగ్ బాస్ సీజన్ 4కు విన్నర్ అయిన అభిజీత్ కు అభినందనలు తెలుపుతూ, త్వరలోనే తను వెండి తెరపై సందడి చేయాలని అభిమానులతో పాటు మనమూ కోరుకుందాం.
Must Read ;- బిగ్ బాస్ సీజన్ 5 కి హోస్ట్ మెగాస్టారా.?