విజయవాడ టీడీపీలో ఈ రోజు జరిగిన పరిణామాలను చక్కదిద్దటంపై అధిష్టానం దృష్టి పెట్టింది. చంద్రబాబు నాయుడి సూచనల మేరకు అచ్చెన్నాయుడు ఎమ్మెల్సీ బుద్దావెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరాతో మాట్లాడారు. అంతేగాక విజయవాడ మేయర్ అభ్యర్థిని కేశినేని శ్వేతను బోండా ఉమ ఇంటికి వెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో వారి మద్దతు కోరాలని అచ్చెన్నసూచించినట్లు తెలిసింది. ఈ మేరకు శ్వేత ఉమ ఇంటికి వెళ్లి వారు మద్దతు కోరారు. దీంతో బుద్దా వెంకన్న తదితరులు ఆమెకు మద్దతిస్తామని ప్రకటించారు.
Must Read ;- విజయవాడ టీడీపీలో రచ్చ కెక్కిన విభేదాలు.. అరికట్టక పోతే దిగులే










