ఏపీ రాజధానిపై రాజ్యసభ వేదికగా క్లారిటీ!
ఏపీ రాజధానిపై చర్చ రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. ‘ఏపీకి రాజధాని ఏది..? రాజధానిని నిర్ణయించే అధికారం ఎవరిది?’ అన్నదానిపై స్పష్టతనివ్వాలని బుధవారం కేంద్రాన్ని ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి ‘అమరావతే ఏపీ రాజధాని’ అని ఆయన పేర్కొన్నారు. తమ వద్ద సమాచారం మేరకు ఏపి రాజధాని అమరావతేనని తేల్చి చెప్పారు. అయితే మరోవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత కొన్ని నెలలుగా రాజధాని రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేసి తీరుతామని మొండిగా వెళ్తోంది. ఇవాళ నుంచి మూడు రాజధానుల కేసులపై హెకోర్టు విచారణ కూడా జరగుతోంది. దీనికి సంబంధించిన వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనం మందు విచారణకు వచ్చాయి. గతవారం వేసిన పిటిషన్లపై సీనియర్ న్యాయవాదులు వాదనలు విపిపించారు. మరోవైపు ప్రభుత్వం సీఆర్డీఏ తరుపున వాదనలు జరగనున్నాయి.
ఏపీ రాజధాని ఎక్కడో చెప్పండి ..
జగన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏపీ రాజధాని అమరావతిపై నేటికీ విషం చిమ్ముతూనే ఉన్నారు. ముందు మూడు రాజధానులని పాట పాడారు. తరువాత మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి.. అసలు ఏపీ రాజధాని ఏమిటి అన్నది స్పష్టతనివ్వలేక పోయారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీ రాజధాని ‘అమరావతే’ అంటుంటే.. అధికార వైసీపీ మాత్రం మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తోంది. దీనిని బట్టి రాజధాని ‘అమరావతి’ ని జగన్ రెడ్డి అంగీకరించడు, మూడు రాజధానులను ముందుకు తీసుకుపోలేడు అన్నది ఇక్కడ సో క్లియర్! ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు రాజధాని లేని రాష్ట్రమని ఏపీ వైపు వింతగా చూస్తుంటే.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ లేఖ చర్చనీయాంశమైంది. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నగరం ఎక్కడో నిర్ణయించాకే తమ కార్యాలయం ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పింది. నగదు నిల్వలు, సరాఫరాకు సంబంధించిన పెట్టెల విషయంపైనా ఆర్బీఐ డిప్యూటీ మేనేజన్ ఎంకే సుభాశ్రీ లేఖలో సమాధానమిచ్చారు. ఈ లేఖతో జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఫీజులు కొట్టేసి.. సైలెన్స్ ప్లీజ్ మోడ్ కు వెళ్లిందన్నది బహిరంగ రహస్యమే!
Must Read:-ప్రజాస్వామ్య మూల స్తంబాలు కుప్పకూలాయి..! ఇక జగన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం?!