బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగింది. తనకు వచ్చిన ఇమేజ్ కి తగ్గట్టుగానే వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తూ.. కెరీర్ లో దూసుకెళుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్.. ఇలా అదిరిపోయే లైనప్ తో దూసుకెళుతున్నాడు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అవుతున్నాడు. దీంతో రామ్ చరణ్ కూడా వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేశాడని వార్తలు వస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చరణ్ తన 16వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. డిఫెరెంట్ జోనర్స్ లో వేటికవే ప్రత్యేకంగా ఉండేలా కథలను ఎంచుకుంటూ మెగా ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కె, చరణ్ గౌతమ్ తో చేయబోయే సినిమా సిమిలర్ సబ్జెక్టుతో తెరకెక్కనున్నాయనే టాక్ వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించే చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ – సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కిస్తున్నారని టాక్ ఉంది. అయితే.. ఇందులో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉంటుందని.. గౌతమ్ – చరణ్ కలిసి చేసే సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. నిజంగానే ప్రభాస్, చరణ్ సేమ్ కాన్సెప్ట్స్ తో సినిమా చేస్తున్నారా..? లేక ప్రచారంలో ఉన్నది అవాస్తవమా..? అనేది తెలియాల్సివుంది.